Site icon HashtagU Telugu

Wrinkles: యుక్త వయస్సులోనే వృద్ధాప ఛాయలు వస్తున్నాయా? కారణం ఇదే..

Causes Overnight Aging Main 1515677500

Causes Overnight Aging Main 1515677500

Wrinkles: కొంతమంది తక్కువ వయస్సుల్లోనే చూడటానికి పెద్ద వయస్సులా అనిపిస్తారు. యుక్త వయస్సులోనే వృద్ధాప ఛాయలు కనిపించడం ద్వారా అందవికారంగా ఉంటారు. దీంతో శరీర సౌందర్యాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తక్కువ వయస్సులోనే ముఖంపై ముడతలు రావడం, శరీరం లూజ్ గా అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే జుట్టు తెల్లగా అయిపోవడం వల్ల ఎక్కువ వయస్సువారిలా కనిపిస్తారు.

అయితే తక్కువ వయస్సులోనే వృద్ధాప్యం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం, శరీరానికి శారీరక శ్రమ అందించకపోవడం కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఒకేచోట కూర్చోని ఉండేవారిలో వద్ధాప ఛాయలు త్వరగా వస్తాయి. రోజుకు కనీసం అరగంటసేపు నడవాలి. అలాగే సుఖ నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోనివారు, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారిలో వృద్ధాప ఛాయలు కనిపిస్తాయి. ఏ వయస్సువారికైనా తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక కండలు లేకపోతే చర్మం మడతలు పడి బలహీనం అయిపోతుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరానికి తగినంత ప్రోటీన్ తీసుకోవాలి,. ప్రోటీన్ తో పాటు భౌతిక శ్రమ కండలను పెంచుతాయి. అలాగే ఎముకలు బంగా ఉండేందుకు సరిపడ క్యాల్షియం తీసుకోవాలి. రోజు ఎండలో అరగంట నడవాలి. దీని వల్ల శరీరారిని డి విటమిన్ అందుతుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత ఒంటరిగా ఉండకూడదు. మనకు ఇష్టమైన పనిచేయాలి.

అలాగే రోజుకు ఒక నువ్వుల ఉండ తినండిజ దీని వల్ల శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. శరీరంలో డి విటమిన్ తగినంత లేకపోతే కాల్సియంను జీర్ణించుకునే శక్తిని కోల్పోతుంది. దీని కోసం నువ్వుల ఉండ రోజు తినాలి.