Site icon HashtagU Telugu

Ladyfingers: బెండకాయతో ఈ మూడు పదార్థాలు కలిపి తింటున్నారా.. అయితే అంతే సంగతులు?

Ladyfingers

Okra

Ladyfingers: బెండకాయ (Ladyfingers) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా బెండకాయను ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరు వంటకాలలో వేసుకొని తింటే మరికొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. బెండకాయలో విటమిన్ సి పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు ఫైబర్ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. కాగా బెండకాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బెండకాయ తినడం మంచిదే కానీ బెండకాయ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలు అసలు తినకూడదట. మరి ఈ బెండకాయ తిన్న తర్వాత ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు.

తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో ఉండే కూరగాయల్లో బెండకాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెండకాయ తింటే గుండె పనితీరు బాగుంటుంది. అయితే మూడు పదార్థాలను బెండకాయతో కలిపి తీసుకోవడం వల్ల అది ప్రాణాంతకంగా మారుతుంది. బెండకాయ తిన్న తర్వాత పాలు లేదా పాల ఉత్పత్తులు అసలు తీసుకోకూడదు. అలా కాకుండా బెండకాయ తిన్న తర్వాత పాల పదార్థాలు తీసుకుంటే విషంగా మారుతుంది. అయితే బెండకాయతో పాటు తినకూడని మరొక పదార్థం పొట్లకాయ.

Also Read: Almonds Side Effects: బాదం పప్పు అధికంగా తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావొచ్చు..!

ఈ రెండు కాంబినేషన్ లో కలిపి కూరలు చేయడం చాలా తక్కువ. బెండకాయ తిన్న వెంటనే పొరపాటున కూడా పొట్లకాయ తినకూడదు. ఇది జీర్ణం వ్యవస్థను దెబ్బతీస్తుంది. వాంతులు రావడం లేదంటే వికారంగా అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో విషం తయారవుతుంది. మరొక పదార్థం ముల్లంగి. ముల్లంగి తినడం మంచిదే కానీ బెండకాయతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. బెండకాయతో కలిపి ముల్లంగి తినడం వల్ల అది విషంతో సమానం. ఇది చర్మం వ్యాధులకు కారణమవ్వడంతో పాటు పొట్టలోకి వెళ్లి కొన్ని విషపూరిత మూలకాలను కూడా సృష్టిస్తుంది.