Health Tips: పాలు తాగేటప్పుడు ఆ పదార్థాలు తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

కాలం మారిపోయింది. దీంతో కాలాన్ని అనుగుణంగా మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 06:30 AM IST

కాలం మారిపోయింది. దీంతో కాలాన్ని అనుగుణంగా మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ బిజీ బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.. డబ్బు సంపాదించాలి అని కష్టపడుతూ సరైన తిండి తినక కంటి నిండా నిద్రలేక లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే సరిగా భోజనం చేయకపోవడం సరిగా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా టైం టు టైం భోజనం చేయమని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు.

లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తి సంపాదించినదంతా హాస్పిటల్స్ కి ఖర్చు పెట్టడానికి సరిపోతుంది. ఇకపోతే చాలామంది ఉదయం,సాయంత్రం సమయంలో పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.. పాలు కావడం వల్ల ఎముకలకు కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అయితే పాలు తాగే సమయంలో పాలు తాగడానికి ముందు ఆ తర్వాత కొన్ని రకాల పదార్థాలను తీసుకోకూడదు. మరి పాలు తాగిన తర్వాత తాగకు ముందు ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు త్రాగిన వెంటనే ముల్లంగిని అస్సలు తినకూడదు.

అలా పాలు తాగిన వెంటనే ముల్లంగిని తింటే జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. అలాగే పాలు తాగగానే నిమ్మరం కానీ నిమ్మకాయతో చేసే పదార్ధాలను కానీ తింటే గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. నిమ్మకాయతో చేసిన పదార్ధాలు తిన్న తర్వాత పాలు కూడా తాగకూడదు. నిమ్మకాయ మాత్రమే కాదు సిట్రిక్ ఉన్న ఫ్రూట్స్ ఏవీ కూడా తినకూడదు. అలా పుల్లటి పండ్లు తీసుకోవడం వల్ల పాలలో ఉండే క్యాల్షియం ఎంజైమ్ లను గ్రహించి శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది. అదేవిధంగా ఇక పాలు తాగిన తర్వాత కానీ ముందు కానీ చేపలు కూడా తినకూడదట. ఇలా తింటే చర్మ సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అందుకే పాలు తాగిన గంట తర్వాత కానీ గంట ముందు కానీ వీటిని తినాలి.