Site icon HashtagU Telugu

Eating: రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Eating

Eating

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యంగా జాబుల నుంచి ఇంటికి అర్ధరాత్రి సమయంలో భోజనం చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొందరి ఇంట్లో ఉన్నా కూడా కాలక్షేపం చేస్తూ రాత్రి 9 – 10 ఆ సమయంలో భోజనం చేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటుంది. పని, ఒత్తిళ్లు అలాగే ఇతర కారణాల వల్ల కొందరు సమయానికి భోజనం తినరు. సరైన సమయానికి తినకపోవడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరగడం మొదలవుతుంది. దీంతో ఊబకాయం పెరుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాకపోవడానికి కారణాల్లో ఆలస్యంగా తినడం కూడా ఒకటి. లేట్ గా తినడం వల్ల మన శరీరం దాన్ని సరిగ్గా జీర్ణించుకోలేకపోతుంది.

ఫలితంగానిద్రసరిగ్గా రాదు. ఒకవేళ రాత్రి ఆలస్యంగా తినాలనుకుంటే పండ్లను తీసుకోవచ్చు. లేదా పాలు తాగొచ్చు. వీటిని తీసుకున్న తర్వాత వెంటనే నిద్ర పోకూడదని కనీసం అరగంటై సేపు నడిచి ఆ తరువాత పడుకోవడం మంచిది. రాత్రి సమయంలో సరైన సమయానికి భోజనం చేయకపోవడం వలన మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. ఇది రాత్రి టైంలో చురుకుగా ఉంటుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఒకరి రక్తంలో మెలటోనిన్ స్థాయిలు 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకోకూడదు. రాత్రి 9 గంటల లోపు డిన్నర్ పూర్తి చేయడం మంచిది.