మామూలుగా రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే యాపిల్ పండు వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరికితే యాపిల్ పండులో చాలావరకు కలుషితం అయినవి ఉంటున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే చాలామందికి యాపిల్ పండు తిన్న తర్వాత మీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఈ అలవాటు మంచిదేనా? యాపిల్ పండు తిన్న తర్వాత నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నీరు మన శరీరానికి చాలా అవసరం. ఇది జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి, పోషకాలను రవాణా చేయడానికి , శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుందట. సాధారణంగా ఫలాలను తిన్న తర్వాత శరీరంలో జీర్ణక్రియ జరగడానికి కొంత సమయం అవసరం. ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఆపిల్ తినడం ద్వారా ఉత్పన్నమయ్యే ఆమ్లాలు జీర్ణక్రియకు సహాయపడతాయట. కానీ వెంటనే నీళ్లు తాగడం వలన ఆ ఆమ్లత తగ్గిపోతుందని, దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవకుండా ఇబ్బందులు తలెత్తవచ్చని చెబుతున్నారు.
ఫలితంగా ఎసిడిటి, గ్యాస్, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట. అలాగే ఫలాలు తినిన వెంటనే నీళ్లు తాగకూడదట. ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగితే జీర్ణాగ్ని మందగిస్తుందట. ఇది అజీర్ణం సమస్యకు దారి తీస్తుందట. దాంతో పాటు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశం ఉంటుందని, ఇది దీర్ఘకాలంలో ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఆపిల్ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇది శరీరానికి తేలికగా జీర్ణక్రియ జరుగేందుకు సహాయపడుతుందట. ఆ తర్వాత తాగిన నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, ఆరోగ్యాన్ని మరింత బలంగా చేస్తుందట. అలాగే ఆహార అలవాట్లలో చిన్నచిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయట.
ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్‌ను తినటం మంచిదే కానీ, దాని తిన్న వెంటనే నీళ్లు తాగడం వంటి అలవాట్లతో దాని ప్రయోజనాలు తగ్గిపోతాయట. అయితే ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉందా లేదా అనేది వ్యక్తిగత జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుందట. మీకు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే, ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవడం మంచిదట. ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే, కొద్దిగా నీరు తాగడంలో ఎలాంటి అభ్యంతరం లేదట.