Site icon HashtagU Telugu

Tea-Water: వేడివేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు?

Hot Tea A Good Habit To Adopt

Hot Tea A Good Habit To Adopt

Tea-Water: మామూలుగా చాలామందికి టీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ కొందరు టీ తాగిన వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్లయిన తాగుతారు. మామూలుగా టీ తాగేముందు ఎవరికైనా మంచినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు. కానీ టీ తాగిన తర్వాత నీళ్లు తాగటం వల్ల కొన్ని అనారోగ్య
సమస్యలు తలెత్తుతాయని తెలుస్తుంది. ఇంతకు ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

డీహైడ్రేషన్: మామూలుగా డీహైడ్రేషన్ సమస్య అనేది నీళ్లు తక్కువగా తీసుకునే వాళ్లకు వస్తుంది. అలా కాకుండా టీ తాగిన వెంటనే నీళ్లు తాగిన కూడా వస్తుంది. మామూలుగా టీలో కెఫిన్ ఉంటుంది. దీంతో టీ తాగగానే దాహం వేస్తుంది. ఇక టీ తాగడం వల్ల మూత్ర విసర్జన బాగా ఎక్కువగా వస్తుంది.

జీర్ణ సమస్య: వేడి వేడి టీ నే కాకుండా ఇతర వేడి వేడి పానీయాలతో పాటు నీటిని తాగడం వల్ల అసిడిటీ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నొప్పి వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.

దంత సమస్యలు: మామూలుగా చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా మరీ వేడి పదార్థాలు తీసుకున్న కూడా దంత సమస్యలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. కారణం నోటిలో ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు ఉండటం నరాలు దెబ్బతింటాయి.

అల్సర్: టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సరీ కూడా వచ్చే ప్రమాదం ఉందట.. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలు కూడా దరిచేరుతాయని తెలుస్తుంది.

రక్త స్రావం: టీ తాగిన తర్వాత నీటి త్రాగటం వల్ల ముక్కు నుంచి రక్తం కూడా వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. అంటే మన శరీరం ఒకేసారి చలి, వేడిని తట్టుకోలేదు. దీంతో ఆ ఒత్తిడి వల్ల ముక్కు నుండి రక్తస్రావం వస్తుంది. అంతేకాకుండా గొంతు సమస్యలు కూడా తలెత్తుతాయని తెలుస్తుంది.