Bath Tips: మీరు స్నానం చేసేటప్పుడు అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

మామూలుగా మనం నిత్యం స్నానం చేస్తూ ఉంటాం. కొందరు రోజుకు ఒకసారి చేస్తే మరికొందరు రోజులో రెండు సార్లు స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంద

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 10:00 PM IST

మామూలుగా మనం నిత్యం స్నానం చేస్తూ ఉంటాం. కొందరు రోజుకు ఒకసారి చేస్తే మరికొందరు రోజులో రెండు సార్లు స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరు రోజు విడిచి రోజు స్నానం చేసే వారు కూడా ఉన్నారు. అయితే స్నానం చేయడం మంచిదే కానీ స్నానం చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు అనేక సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు అసలు చేయకూడదు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం స్నానం చేస్తున్నప్పుడు శరీరం శుభ్ర పడటమే కాకుండా కొన్ని రకాల రోగాలు రాకుండా ఉంటాయి. స్నానం సరిగ్గా చేయ్యకపోతే ఎన్నో అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది.

సూక్ష్మ క్రిములు, మలినాలను క్లీన్ చేసుకునేందుకు స్నానం చేస్తారు. ఇలా స్నానం చేసేటప్పుడు అన్ని శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది నాభి లేదా బొడ్డును క్లీన్ చేసుకోవడం మర్చి పోతూ ఉంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశం. చాలా మంది నాభి శుభ్రం చేసుకోరు. దీని వల్ల అక్కడ దుర్వాసన వచ్చి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాభి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. అలాగే స్నానం చేసేటప్పుడు చెవుల వెనుక కూడా శుభ్రం చేసుకోవాలి. చెవుల వెనుక ఎక్కువగా నూనె, మృత కణాలు, చెమట అనేవి ఎక్కువగా చేరుతాయి. జస్ట్ వాటర్ తో తుడిచినంత మాత్రాన మురికి పోదు.

సబ్బుతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పాదాల్లో కూడా మురికి ఎక్కువగా చేరుతుంది. కానీ చాలా మంది పాదాలను శుభ్రం చేసుకోరు. పాదాలపై ఎక్కువగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేరతాయి. రోగాలను ఎక్కువగా వ్యాపింపజేసే బ్యాక్టీరియా పాదాలపై చేరుతుంది. కాబట్టి పాదాలను పైపైనే కాకుండ గోళ్లపై, వేళ్ల మధ్యలో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చేతి గోర్లను కూడా ఖచ్చితంగా శుభ్రం చేయాలి. గోర్లలో ఎక్కువగా మురికి, క్రిములు చేరతాయి. ఇది ఎన్నో రోగాలకు కారణం అవుతాయి. గోర్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. శరీరంలోకి చేరి.. ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. దీంతో పలు రకాల రోగాలు వచ్చే అవకశాం ఉంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి.