ద‌గ్గు మందు వాడుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

ఈ లక్షణాలు ఎక్కువ కాలం కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఎందుకంటే తప్పుడు మందులు గంభీరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Cough Syrup

Cough Syrup

Cough Syrup: చిన్నపాటి దగ్గు రాగానే చాలామంది మెడికల్ షాపులో దొరికే కఫ్ సిరప్‌లను కొని తాగేస్తుంటారు. ఇది సాధారణ విషయంగా అనిపించినప్పటికీ దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి సిరప్‌లు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించి, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి రావచ్చు.

అంతేకాకుండా చాలామంది నిద్ర కోసం లేదా రిలాక్స్ అవ్వడం కోసం దగ్గు మందులను వాడుతుంటారు. కానీ దగ్గు లేకుండా కఫ్ సిరప్ వాడటం ప్రాణాలకే ప్రమాదం. ఈ ఆర్టిక‌ల్‌లో మీ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీరు తెలుసుకోవలసిన కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి.

కఫ్ సిరప్‌లలో ఉండే ప్రమాదకర పదార్థాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. అనేక కఫ్ సిరప్‌లలో డైఇథిలీన్, ఎథిలీన్ గ్లైకాల్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటున్నాయి. దగ్గు మందు చేదును తగ్గించడానికి వీటిని కలుపుతారు. కానీ వీటిని అధిక మోతాదులో తీసుకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా సిరప్‌లు వాడటం చాలా రిస్క్.

Also Read: RCB అభిమానులకు గుడ్ న్యూస్!

కఫ్ సిరప్ వల్ల కలిగే దుష్ప్రభావాలు

అవసరానికి మించి దగ్గు మందులు వాడటం వల్ల ఈ క్రింది సమస్యలు తలెత్తవచ్చు.

  • గుండె వేగంగా కొట్టుకోవడం.
  • తల తిరగడం, విపరీతమైన తలనొప్పి.
  • చూపు మసకబారడం.
  • వాంతులు, వికారం.
  • నిద్రలేమి, మానసిక అస్థిరత.

ఈ లక్షణాలు ఎక్కువ కాలం కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఎందుకంటే తప్పుడు మందులు గంభీరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

దగ్గుకు సురక్షితమైన చికిత్స – కొన్ని ముఖ్యమైన చిట్కాలు

సూచనలను అనుసరించండి: మందుల ప్యాకెట్‌పై ఉన్న సూచనలను చదవండి. డాక్టర్ చెప్పిన మోతాదులోనే వాడండి.

స్వీయ వైద్యం వద్దు: మీ అంతట మీరు మందుల డోసేజ్ పెంచడం లేదా మార్చడం చేయవద్దు.

సహజ చికిత్సలు: దగ్గు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటి ఆవిరి పట్టడం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగడం, అలాగే తులసి లేదా అల్లం టీ తీసుకోవడం మంచిది.

వైద్యుడిని కలవండి: దగ్గు 7 రోజులు దాటినా తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించండి.

ప్రమాద హెచ్చరిక: మందు వాడిన తర్వాత తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గుండె వేగం పెరగడం వంటివి జరిగితే వెంటనే మందు ఆపేసి డాక్టరుకు చూపించండి.

  Last Updated: 04 Mar 2026, 04:10 PM IST