మనలో చాలామందికి ఆహారం తిన్న తర్వాత మత్తుగా బద్ధకంగా అనిపించి నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మంది ఆఫీసు పనులను చేయలేకపోతుంటారు. అయితే అందుకే కారణం బద్దకంగా అనిపించడమే అని చెప్పాలి. తిన్న తర్వాత బద్ధకంగా అనిపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. తిన్న తర్వాత శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. దీనివల్ల కూడా అలసట కలుగుతుందట.
సెరోటోనిన్ అనేది ఒక రసాయనం. ఇది నిద్ర, మానసిక స్థితి చక్రాన్ని నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. ఎక్కువ తినడం వల్ల బద్ధకంగా, అలసటగా ఉంటుంది. తక్కువ తినేవారి కంటే ఎక్కువ తినే వారే ఎక్కువ బద్దకంగా ఉంటుంది. ఎక్కువ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే శక్తి కూడా తగ్గుతుందట. పాస్తా, రైస్,వైట్ బ్రెడ్, కేక్, కుకీలు, డోనట్స్, మఫిన్స్,భుట్టా మిల్క్ షుగర్, క్యాండీ
సాల్మన్, చికెన్, గుడ్లు,బచ్చలికూర, మిల్క్, సోయా ఉత్పత్తులు, జున్ను తిన్నప్పుడు ఎక్కువగా బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా ఉండాలంటే వాటిని తక్కువగా తినాలని చెబుతున్నారు. మీ ప్లేట్ ను ఫుల్ గా నింపడం మానుకోవాలి.
భోజనం ఎక్కువగా చేయడం వల్ల శరీరం పోషకాలను విచ్ఛిన్నం చేయడానికి, గ్రహించడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ రక్త ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఈ ప్రక్రియకు శక్తి చాలా అవసరం. ఇది మీకు అలసటను, బద్ధకాన్ని కలిగిస్తుంది. ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు సాగదీస్తుంది. అలాగే అసౌకర్యం కలుగుతుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, శక్తిని ఆదా చేయాలనే కోరికకు దారితీస్తుంది. కొన్ని ఆహారాలు సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇది మరింత బద్ధకానికి దారితీస్తుంది.
అదేవిధంగా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం అసలు మంచిది కాదట. తర్వాత కనీసం 100 అడుగుల నడవాలని లేదంటే 15 నుంచి 20 నిమిషాల పాటు తేలికపాటి పనులను చేయాలట. నడక జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరచడానికి, జీర్ణవ్యవస్థ ద్వారా ఆహార కదలికకు సహాయపడతుంది. అలాగే అజీర్ణ సంభావ్యతను కూడా తగ్గిస్తుంది. తేలికపాటి నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.