Alcohol : మీరు కూడా మద్యం తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

ఈ మద్యాన్ని (Alcohol) అతిగా సేవించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తెలిసినా కూడా ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 06:20 PM IST

ధూమపానం,మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా వాటిని తాగడం మాత్రం మానుకోరు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం (Alcohol) సీసాల పైనే రాసి ఉంటారు. ఈ మద్యాన్ని అతిగా సేవించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తెలిసినా కూడా ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడో ఒకసారి మద్యాన్ని సేవిస్తే మరి కొంతమంది ప్రతి రోజు మద్యాన్ని సేవిస్తూనే ఉంటారు. చుక్క పడినదే రోజు గడవని వారు కూడా చాలామంది ఉన్నారు. అలా మద్యానికి బాగా అడిక్ట్ అయిపోయిన వారు ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగానే ఉన్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

మద్యం (Alcohol) సేవించడం వల్ల లాభాలతో పోల్చుకుంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అతిగా మద్యం త్రాగడం వలన ప్రేగులు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని కోల్పోతుంది. పోషకాలు, విటమిన్ లను సమర్థవంతంగా గ్రహించకుండా అడ్డుపడవచ్చు. అతిగా మద్యం (Alcohol) సేవించడం వలన గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వలన కడుపులోని ఎంజైమ్ లను కూడా చికాకు పెడుతుంది. దీర్ఘకాలిక మంట, అల్సర్ కు దారితీస్తుంది. ఇది అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. మద్యపానం (Alcohol) ఎక్కువగా చేయడం వలన అధిక రక్తపోటుతో పాటు సహా గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. రక్తనాళాల్లోని కండరాలను ప్రభావితం చేస్తుంది.

దానిని చాలా వరకు దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది కడుపుపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఒకేసారి ఆల్కహాల్ ఎక్కువగా త్రాగడం వలన జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఆల్కహాల్ వలన మెదడు జ్ఞాపకశక్తి సామర్థ్యం తగ్గుతుంది. ఆల్కహాల్ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. పాదాలు, చేతుల్లో, తిమ్మరింపు వంటి సమస్యలు జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లను, ఈ శరీరం గ్లూకోస్ నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ లో మంటను కలిగిస్తుంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన పేగుపూత వ్యాధికి కారణం అవుతుంది. ముఖ్యంగా పేగుల్లో ఆల్కహాల్ రసాయన చర్య ద్వారా ప్రేగులను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Also Read:   LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్.. భారీగా పెరిగిన ధరలు..!