సీజన్ మారినప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య త్రోట్ ఇన్ఫెక్షన్. ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆహారం పదార్థాలు తినాలన్నా నీరు తాగాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే ఈ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇందుకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి దీనిని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని పెద్ద గ్లాసు గోరువెచ్చని నీటిలోని కలుపుకొని రోజుకు ఒకసారి తాగటం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చట.
అలాగే దాల్చిన చెక్క ఇతర వంటగది పదార్థాలతో కలిపి ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కలపాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగడం, లేదా పుట్టించడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి.. అలాగే గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని పూజించడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చట. ఆ ఉప్పు నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపటం వలన మరింత ఉపయోగం చేకూరుతుందని చెబుతున్నారు.
ఆపిల్ స్పైడర్ వెనిగర్ లో చాలా విటమిన్లు, ఎంజైములు, ప్రోటీన్లు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయట. అదేవిధంగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలట. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తేనె జోడించాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి ఒకసారి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గటంతో పాటు దగ్గుతో పోరాటానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ కేవలం గొంతు నొప్పిని తగ్గించడానికి కాకుండా బరువు తగ్గటానికి, డయాబెటిక్ రోగులకు కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు.