Eating: అన్నం తినేటప్పుడు ఈ పనులు చేస్తున్నారా? మీరు డేంజర్‌లో పడ్డట్లే!

అన్నం ఎలా తినాలనేది చాలామందికి తెలియదు. ఎలా పడితే అలా, ఎక్కడబడితే అక్కడ కూర్చోని తింటూ ఉంటారు. అయితే అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - March 30, 2023 / 08:41 PM IST

Eating: అన్నం ఎలా తినాలనేది చాలామందికి తెలియదు. ఎలా పడితే అలా, ఎక్కడబడితే అక్కడ కూర్చోని తింటూ ఉంటారు. అయితే అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. అన్నం తినేటప్పుడు ఏవి పడితే అవి పనులు చేయడం వల్ల అరిష్టం జరుగుతుందని అంటున్నారు. అన్నంను పరబ్రహ్మస్వరూపంగా అందరూ భావిస్తారు. దీంతో అన్నం తినేప్పుడు ఈ తప్పులు చేయవద్దని సూచిస్తున్నారు. అవి ఏంటో చూద్దాం రండి.

అన్నం తిన్న తర్వాత ప్లేట్‌లోనే చాలామంది చేతులు కడుగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం అరిష్టమని చెబుతున్నారు. ఇలా చేయవద్దని అంటున్నారు. ప్లేట్‌లోనే చేతులు కడుక్కొవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. అలాగే అన్నం తినేటప్పుడు ఇతర ఆలోచనలు చేయకూడదని అంటున్నారు. పూర్తిగా ఆహారంపై తినడంపైనే దృష్టి పెట్టాలని, అవసరమైన ఆలోచనలు చేయకూడదని అంటున్నారు.

చాలామంది చెంచాతో అన్నం తిని ఆ తర్వాత అందులోనే చేయి కడుక్కుంటారు. ఇలా చేయడం వల్ల చాలా అరిష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని చెబుతన్నారు. అలాగే అన్నం తినేటప్పుడు చేతితో ప్లేట్ పట్టుకోవద్దని, ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆదా అవ్వదని అంటున్నారు. దీంతో ఆహారం తినేటప్పుడు సరిగ్గా తినాలని సూచిస్తున్నారు. తిన్న తర్వాత ప్లేట్ లోనే చేయి కడుక్కొవడం పాపమని అంటున్నారు.

అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరినీ తిట్టకూడదని, ఆవేశపడకూదని చెబుతున్నారు. ఇక భోజనం చేసేటప్పుడు ప్లేట్‌ను పక్కకు పెట్టడం, విసిరి కొట్టడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. దీని వల్ల దోషం ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే భోజనంపై విసుగు, నిర్లక్ష్యం చూపించకూడదని, ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అన్నం దొరదని చెబుతున్నారు. ఇక ఇంట్లో గొడవలతో అన్నం మానేయడం, అలగడం లాంటి చేయకూదని అంటున్నారు.ఈ పనులు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు.