Site icon HashtagU Telugu

Night Shifts: నైట్ షిప్టులు చేసేటప్పుడు ఈ పనులు చేయండి.. మీ ఆరోగ్యం భద్రం

Graveyard Shift 759

Graveyard Shift 759

Night Shifts: ఇటీవల నైట్ షిప్టు జాబ్ లు ఎక్కువైపోయాయి. సాఫ్ట్ వేర్ జాబ్ దగ్గర నుంచి కాల్ సెంటర్ల జాబ్ వరకు అన్నీ జాబుల్లోనే నైట్ షిప్ట్ లు వచ్చాయి. నైట్ షిఫ్ట్ చేయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఒకవైపు నిద్ర తన్నుకుంటూ వస్తోంది. రాత్రి డ్యూటీలు చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యాల బారిన పడే అవకాశముంటుంది. రాత్రి షిప్టులు చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

కొంతమది నెలల తరబడి నైట్ షిప్టులు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి హెల్త్ పాడైపోయే అవకాశముంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి షిప్టులు చేసేవారికి డయాబెటిస్, ఊబకాయం, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లాంటి సమస్యలు వస్తాయి. నైట్ షిప్టులు చేసేవారు ఇంటి నుంచి ఆఫీస్ కు బయలుదేరడానికి ముందు సిరిధాన్యాలలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. రాగి, జొన్న రోట్టె, మిల్లెట్ జావ, రాగి జావ లాంటివి తీసుకోవాలి.

చిరుధన్యాలలో విటమిన్ బీ12, బీ6, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ లాంటి పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి మీ బరువును అదుపులో ఉంచుతాయి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోయే ముందు పాలలో గుల్కంధ్ వేసుకుని, అరవిపండుతో కలిసి తింటే ఆకలి భాదలను దూరం చేస్తుంది. అంతేకాకుండా గుల్కంద్, అరటిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇక నైట్ షిప్ట్ లు చేసేవారు కాఫీ, టీలు లాంటివి తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. టీ, కాఫీలు ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనికి బదులు మజ్జిగ, సోంపు నీరు తాగడం మంచిది. నైట్ షిష్టులు చేసేవారు ఉదయం ఎండలో కాసేపు నడవాలి. దీని వల్ల విటమిన్ డి లభిస్తుంది. మధ్యాహ్నం వేళల్లో పనుకునే సమయంలో ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. అదే సమయంలో రోజూ నిద్రపోవాలి.