Oil Food : మనలో చాలా మందికి ఆయిల్ ఫుడ్ అనేది ఎప్పుడూ తినాలని అనిపిస్తుంది. అంటే ఫ్రైడ్ రైస్ లు, న్యుడిల్స్, బజ్జీలు, బొండాలు, కారప్పూస, బూందీ, చేకోడి,ఫ్రై పదార్థాలు,పూరీలు .. ఇలా రకరకాల ఆయిల్ ఫుడ్స్ అనేవి మనం ఇష్టంగా తింటూ ఉంటాము. అవి ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా మన జిహ్వ చాపల్యాన్ని ఆపుకోలేము. అయితే ఇలాంటివి తినడం వలన మనకు ఎక్కువగా దాహం వేయడం, త్వరగా జీర్ణం అవ్వక ఇబ్బంది పడుతుంటాము. కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆయిల్ ఫుడ్ తొందరగా జీర్ణం అవ్వదు కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత గోరువెచ్చని నీళ్ళు తాగాలి. గోరువెచ్చని నీళ్ళు తాగడం వలన ఆ నీళ్ళు మనం తిన్న ఆహారాన్ని పలుచగా చేసి జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత దాహం వేసి చల్లని నీళ్ళు తాగడం చేస్తుంటారు దీని వలన ఇంకా ఇబ్బంది పడుతుంటారు.
ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత మనం అరగంట సేపు వాకింగ్ చేస్తే మంచిది. లేదంటే పొట్ట అంత అనీజీ గా ఉంటుంది. కనీసం పావుగంట సేపు అయినా వాకింగ్ చేయాలి అప్పుడే మనకు రిలీఫ్ గా ఉంటుంది.
ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత పెరుగు తినాలి పెరుగు కూడా ఆయిల్ ఫుడ్ ని జీర్ణం చేసేందుకు సహాయపడుతుంది.
ఆయిల్ ఫుడ్ తినాలని ముందుగా అనుకున్నప్పుడు ఉదయం పూట లేదా తిన్న తర్వాత రాత్రి పూట ఫ్రూట్ సలాడ్ లేదా ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు తినడం మంచిది. ఇవి తినడం వలన మన శరీరానికి ఫైబర్ మరియు పోషకాలు అంది జీర్ణ వ్యవస్థ యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే ఫుడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది.
కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత వాకింగ్ చేయడం, పెరుగు తినడం, సలాడ్ లు తినడం, గోరువెచ్చని నీళ్ళు తాగడం చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది.
Also Read : Watter Apple : వాటర్ ఆపిల్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?