Father health impact : పిల్లలపై తండ్రి ఆరోగ్య ప్రభావం ఉంటుందా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు…?

పిల్లల ఆరోగ్యంపై తండ్రి ప్రభావం ఉంటుందా..?ఈ ప్రశ్నకు మీరేం సమాధానం చెబుతారు? ఉంటుందా..లేదా? కానీ చాలామందికి ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 07:15 PM IST

పిల్లల ఆరోగ్యంపై తండ్రి ప్రభావం ఉంటుందా..?ఈ ప్రశ్నకు మీరేం సమాధానం చెబుతారు? ఉంటుందా..లేదా? కానీ చాలామందికి ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది. సమాధానం తెలుసుకోవాలన్న ఉత్సాహం కూదా ఉంది. శాస్త్రవేత్తలకూ అది ఆసక్తికరమైన అంశమే.

ఫలదీకరణ సమయంలోనే తండ్రి నుంచి జీన్స్ పిండానికి అందుతాయి. సదరు జీన్స్ లో క్వాలిటీ లేనట్లయితే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాణ్యత అనేది ఇక్కడ తండ్రి వయస్సు కీలకం అని చెప్పుకోవాలి. తండ్రి ఎంత యువకుడిగా ఉంటే బిడ్డకు వెళ్లే జీన్స్ అంత నాణ్యంగా ఉంటాయి. అదే వయస్సు మీరిన..అనారోగ్య సమస్యలున్న తండ్రి అయితే పిల్లలకు కూడా అందే జీన్స్ అనారోగ్యంగా ఉంటాయి.

వయస్సు పెరుగుతున్నా కొద్దీ బిడ్డలకు వెళ్లే జీన్స్ నాణ్యత అనేది తగ్గిపోతుంది. అందుకే చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. ఒక వ్యక్తి యుక్త వయస్సులో ఉన్నప్పుడు పాస్ చేసే జీన్స్ కు…40ఏళ్ల దాటిన తర్వాత ఉండే జీన్స్ కు నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 40 ఏళ్లు దాటిన సమయంలో పురుషుడు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే అప్పుడు బిడ్డలకు ఆటిజం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంతేకాదు పొగతాగే అలవాటు ఉన్న వ్యక్తుల వీర్య నాణ్యతపై ప్రభావం చూపుతుంది. పొగతాగే అలవాటు వల్ల వారి పిల్లల ఆరోగ్యంపై తప్పకుండా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. డయాబెటిస్, రక్తపోటు ఇలాంటివి కూడా వంశపార్యపరంగా పిల్లలకు సోకుతాయి. తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లయితే…వారి పిల్లలకు కూడా భవిష్యత్తులో ఈ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

తలెసీమియా, రక్తానికి సంబంధించిన వ్యాధులు కూడా సగానికి సగం తండ్రి నుంచే వ్యాపించడానికి అవకాశం ఉంటుందట. శరీరంలో పలు భాగాల్లో వెంట్రుకలు అధికంగా మొలిచే హైపర్ ట్రైకోసిస్ సమస్య కూడా తండ్రి నుంచి పిల్లలకు వ్యాపించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయట. ఇక మానసిక ఆరోగ్యం విషయంలోకూడా తండ్రి డిప్రెషన్ తో ఉంటే ఆ వ్యక్తికి పుట్టే పిల్లలకు కూడా ఆ సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కాబట్టి తండ్రి ప్రభావం పిల్లలపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పువచ్చు. తల్లి స్థూలకాయం ప్రభావం కంటే తండ్రి స్థూలకాయ ప్రభావమే పిల్లలపై ఎక్కువగా ఉంటుందట. కాబట్టి తండ్రి పిల్లలకు కొంత సమయం కేటాయించాలి. వారి మానసిక ధైర్యం పెంపొదించేలా చేయాలి.