Diabetes, Don’t Worry: షుగర్ ఉందని ఆందోళన చెందుతున్నారా..?డోంట్ వర్రీ..!!

నేడు ప్రపంచంలో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 09:00 AM IST

నేడు ప్రపంచంలో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ ఆహారపు అలవాట్లలో మార్పులే దీనికి ప్రధాన కారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే షుగర్ వ్యాధిబారిన పడిన వారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతోపాటు…కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఆనందకరమైన జీవితాన్ని కొసాగించవచ్చు.

మధుమేహంతో బాధపడుతుంటే:
మన శరీరానికి ప్రతిరోజూ శారీరక శ్రమ అనేది చాలా అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే…మిగతావారు మాత్రం రోజులో ఒకగంట సేపు తప్పనిసరిగా ఏదో ఒకరకమైన శ్రమను కలిగించాలి. నడక, జాగింగ్, వ్యాయామం చేస్తుండాలి. అధిక బరువు పెరగకుండా…వీలైనన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదు.

ఆహారం తీసుకునే సమయంలో క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఉదయం, మధ్యాహ్నం తీసుకున్న ఆహారంతో పోల్చితే…రాత్రి సమయాల్లో చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. భోజనంలో తీసుకునే వైట్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారం.

మంచి పోషకాలు అందించే పండ్లను తింటుండాలి. బొప్పాయి, గ్రీన్ ఆపిల్, కివి, జామకాయ, కీరదోసకాయ ఎక్కువగా తినాలి. 30ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా డయాబెటిక్ పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అతి ఆకలి, అతి దాహం, రాత్రి వేళ్ల మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం, తొందరగా అలసిపోవడం, బరువు పెరగడం, తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.