Site icon HashtagU Telugu

Health Tips: టీ, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Health Tips (2)

Health Tips (2)

మనలో చాలామందికి ఉదయం లేవని టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ కాఫీ తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేని వారు ఉన్నారు. రోజులో కనీసం ఒక్కసారి నా టీ తాగకపోతే ఎలాగో ఉంటుందని అంటూ ఉంటారు. అయితే చాలామంది టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత లేదంటే వేసుకోకముందు కాఫీ టీ వంటివి తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా మెడిసిన్స్ కాఫీ టీ లతో పాటుగా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ విధంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది యాంటీ బయోటిక్స్ ను తీసుకుంటుంటారు.

అయితే వీళ్లు పక్కాగా టీ లేదా కాఫీతోనే వీటిని వేసుకుంటూ ఉంటారు. కానీ టీ, కాఫీలో లక్షణాలు యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఇలా మందులను తీసుకోవడం వల్ల సంక్రమణ ప్రమాదం పెరుగుతుందట. అలాగే ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి కొన్ని రకాల నొప్పి నివారణా మాత్రలను కూడా టీ లేదా కాఫీలతో తీసుకూడదట. ఎందుకంటే ఈ మందులను వీటితో తీసుకుంటే కడుపులో పుండ్లు ఏర్పడతాయట. అలాగే కడుపులో చికాకు కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా థైరాయిడ్ మందులను కూడా టీ కాఫీలతో కలిపి అస్సలు తీసుకోకూడదట. దీనివల్ల హైపోథైరాయిడిజం మందుల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.

ఆస్తమా మెడిసిన్స్ ను కూడా టీ, కాఫీలతో పొరపాటున కూడా తీసుకోకూడదట. ఎందుకంటే టీ, కాఫీలో ఉండే కెఫిన్ లో బ్రోన్కైటిస్ ఉంటుందట. ఇది ఈ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని, అలాగే తలనొప్పి, కడుపు నొప్పి, చికాకు, చంచలత వంటి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. డయాబెటిస్ పేషెంట్లు కూడా తమ మందులను టీ, కాఫీలతో తీసుకోకూడదట. ఇది మీ శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని, కాఫీ,టీలో ఉండే చక్కెర, పాల వల్ల ఇలా జరుగుతుందని దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని ఇది మెడిసిన్స్ ప్రభావాన్ని కూడా బాగా తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఇలా కాఫీ టీ లతో మెడిసిన్స్ తీసుకునేవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.