Site icon HashtagU Telugu

Summer Food : సమ్మర్ వచ్చింది జాగ్రత్త…పిల్లలకు ఈ ఫుడ్ పెడితే..ఆసుపత్రుల పాలవడం ఖాయం..

Summer Food

Summer Food

వేసవి (Summer Food) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతాయని ఇప్పటికే ఐఏండి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఎండదెబ్బ (heat wave)తీవ్ర అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ పదార్థాలకు దూరంగా:

సాధారణంగా వేసవిలో పెద్దవాళ్ల కంటే పిల్లలకు శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా నీటి కొరత వల్ల… చలికాలం కంటే వేసవిలో ఆహారం చాలా తేలికగా పాడైపోతుంది.అందుకే వాటిని తిన్నప్పుడు ఆహార వ్యామోహం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పిల్లలకు వేసవిలో ఇచ్చే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. జంక్ ఫుడ్, వేపుడు పదార్థాలకు(food) దూరంగా ఉంచాలి. ఇవి డిహైడ్రేషన్ కు దారి తీస్తాయి. ఈ వేసవిలో పిల్లలకు ముఖ్యంగా మంచినీరు, పుచ్చకాయ, పండ్లు మొదలైన సహజ వనరులను తినిపించాలి. ఎల్లప్పుడూ వారు చల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా పిల్లలను శీతల పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.. కొందరు తల్లులు, పిల్లలకు పండ్లు ఇవ్వరు.. శీతలపానీయాలు ఇవ్వడం వల్ల జలుబు, జ్వరం వస్తుంది. ఇంట్లోనే తయారు చేసిన జ్యూసులు ఇవ్వొచ్చు. బెల్లం తప్ప ఇతర పండ్లను పిల్లలకు ఆహారంలో ఇవ్చొచ్చు. హానికరమైన శీతల పానీయాలు, ఐస్ క్రీంలు, లాంటివి అస్సలు ఇవ్వకూడదు.

ఎండలో ఆడనివ్వకండి:
సెలవు రోజుల్లో పిల్లలు ఎండలో ఆడకుండా చూసుకోవాలి, చర్మ సమస్యలు, శారీరకంగా అలసట వంటివి కలుగుతాయి కాబట్టి 9 గంటల తర్వాత ఎండలో ఆడకుండా చూడాలి. సాయంత్రం 5 గంటలకు ఆడుకోవచ్చు.

మళ్లీ కరోనా:
గత పది రోజులుగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అది ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఎప్పటిలాగే శానిటైజర్ మాస్క్‌లను ఉపయోగించడం మంచిది. ఇంకా తగ్గుతుందా అనేది మన చేతుల్లోనే ఉంది, బయటికి వెళ్లేటప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మాస్క్ ధరించడం మంచిది.