Fruits: ఈ పండ్లు పరగడుపున పొరపాటున కూడా తినకూడదు.. తింటే అంతే సంగతులు!

సాధారణంగా చాలామంది ఉదయం లేవగానే కొన్ని రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే పండ్లు

  • Written By:
  • Publish Date - November 5, 2022 / 07:30 AM IST

సాధారణంగా చాలామంది ఉదయం లేవగానే కొన్ని రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే పండ్లు కూరగాయలలో షుగర్, కేలరీలు, యాసిడ్లు ఉంటాయి. కాళీ కడుపుతో వాటిని తినడం వల్ల డయాబెటిస్ అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి వీటితో పాటుగా ఇంకా ఏ ఏ పండ్లను ఉదయం పూట తినకూడదో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. పరగడుపున టమాటాలు తినకూడదు. వీటిని తినడం వల్ల వాటిలో ఉండే టాన్నిక్ యాసిడ్ పొట్టలో ఎసిడిటీని పెంచుతుంది. దీనివల్ల దీర్ఘకాలంగా గ్యాస్టిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అది చాలామంది ఉదయాన్నే అరటి పండు తింటూ ఉంటారు. ఎనర్జీ కోసం అరటిపండును తినడం వల్ల ఎనర్జీ వచ్చినప్పటికీ రక్తంలో మెగ్నీషియం లెవెల్స్ పెరిగి గుండెకు హాని కలుగుతుంది. అలాగే ఉదయాన్నే కీరదోసను తినకూడదు. వీటిని తినడం వల్ల వాటిలో ఉండే అమైనో యాసిడ్లు కడుపునొప్పి గుండె మంట వచ్చేలా చేస్తాయి. అలాగే పరగడుపున పుల్లటి పండ్లను తినకూడదు. పుల్లటి పండ్లు అనగా నారింజ,ద్రాక్ష, ఉసిరి వంటివి తినడం వల్ల పొట్టలో గ్యాస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అల్సర్లు గ్యాస్టిక్ సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి ఒకవేళ వీటిని తినాలి అనుకుంటే ఆహారం తిన్న తర్వాత తినడం మంచిది. అలాగే పరగడుపున మామిడికాయలను తినకూడదు. మామిడికాయలలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే నల్లటి ఖర్జురాలను తినడం వల్ల వాటిలో ఉండే పెక్టీన్, టాన్నిక్ యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్ తో కలుస్తాయి. అందుకే పడగడుపున పుట్ట ఖాళీగా ఉన్నప్పుడు నల్లటి ఖర్జూరం తినకూడదు. పియర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండుని ఖాళీ కడుపుతో తినడం వల్ల మూత్రం దెబ్బతింటుంది. లిచి పండుని తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి. అంతే కాకుండా కడుపునొప్పి వచ్చేలా కూడా చేస్తాయి. కాబట్టి వీటిని పరగడుపున తినకూడదు.