పాల(Milk)లో కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలంగా చేసి, కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే పాలను సరైన పద్ధతిలో తీసుకోవాలి. పాలు తాగిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగకపోగా, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
PM Modi : సామాన్యులకు దీపావళి కానుక.. తగ్గనున్న జీఎస్టీ రేట్లు: ప్రధాని మోడీ
పాలు తాగిన వెంటనే లేదా పాలతో కలిపి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఉదాహరణకు, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, సాల్టీ బిస్కెట్స్, జంక్ ఫుడ్ వంటివి తీసుకోకూడదు. వీటిని పాలు తాగిన వెంటనే తీసుకుంటే కడుపు, పేగు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే, పుల్లటి గుణాలు కలిగిన నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా పాలు తాగిన వెంటనే తినకూడదు. ఈ పండ్లలోని యాసిడ్ పాలను గడ్డకట్టించి, గ్యాస్, ఉబ్బరం, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే పాలు తాగిన 2-3 గంటల తర్వాత మాత్రమే పండ్లను తినడం మంచిది.
అదేవిధంగా, బెల్లం కలిపిన పాలు ఆరోగ్యానికి మంచివే అయినా, బెల్లంలో ఉప్పు కలిసినప్పుడు లేదా బెల్లం వేడి స్వభావం కలిగి ఉన్నప్పుడు పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. చేపలు, పాలు రెండూ పోషకాలను కలిగి ఉన్నప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం ఫుడ్ పాయిజన్, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. పాలు తాగిన వెంటనే పుచ్చకాయ తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్, పుచ్చకాయలోని యాసిడ్‌తో కలిసినప్పుడు గడ్డకడుతుంది, దీనివల్ల కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, పాలు తీసుకున్న వెంటనే ఈ ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తపడాలి.