Site icon HashtagU Telugu

Ice Cream: ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి?

Mixcollage 25 Jul 2024 10 49 Am 5592

Mixcollage 25 Jul 2024 10 49 Am 5592

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ముఖ్యంగా వేసవికాలం వచ్చింది అంటే చాలు ఐస్ క్రీమ్లు తెగ తినేస్తూ ఉంటారు. అయితే ఐస్ క్రీమ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని వైద్యులు ఎంత చెప్పినా కూడా చాలామంది అలాగే తింటూ ఉంటారు. ఇక ఐస్ క్రీమ్ లలో కూడా రకరకాల ఫ్లేవర్ లు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ మీరు ఐస్ క్రీమ్ తింటే కనుక కొన్ని రకాల ఆహార పదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఐస్ క్రీం తిన్న వెంటనే కొన్ని రకాల ఫుడ్స్ అసలు తీసుకోకూడదట.

మరి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేడి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా టీ, కాఫీ, గ్రీన్ టీ ఇలాంటివే తాగడం వల్ల కడుపునొప్పి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పుల్లటి పండ్లను అసలు తినకూడదట. ఎందుకంటే సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ యాసిడ్లు పొట్టలోని ఐస్ క్రీమ్ తో కలిసి గ్యాస్, అజిర్ణం వంటి వాటికీ కారణం అవుతాయని చెబుతున్నారు. అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎప్పుడు వేయించిన ఆహార పదార్థాలను తినకూడదట.

ఇలా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేయించిన ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపులో ప్రతీకూల రసాయన ప్రతి చర్యలకు కారణం అవుతుందట. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాక్లెట్స్ వంటివి తినడం చేయకూడదట. అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆల్కహాల్ సేవించడం వల్ల అవాంతులు విరోచనాలు,తల తిరగడం వంటి సమస్యలు వస్తాయట.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.