మాములుగా వేసవి కాలం మొదలయ్యింది అంటే చాలు ఐస్ క్రీమ్ లను తెగ తింటుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఐస్ క్రీమ్ లను తింటూ ఉంటారు. మండే ఎండల్లో చల్లగా ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. అయితే ఐస్ క్రీమ్ తినడం మంచిదే కానీ, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మాత్రం కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు. మరి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మాములుగా ఐస్ క్రీం తిన్న తర్వాత వేడి పానీయాలకు దూరంగా ఉండాలట. ఐస్ క్రీం తినేటప్పుడు టీ లేదా వేడి కాఫీ తాగకూడదట. అది కడుపు నొప్పి, వాంతులు కలిగిస్తుందట. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పుల్లటి పండ్లు తినకూడదట. సిట్రస్ పండ్లలోని యాసిడ్ లు మీ పొట్టలోని ఐస్‌క్రీమ్ తో కలిసి గ్యాస్,అజీర్ణానికి కారణమవుతాయట. ఐస్ క్రీం తిన్న తర్వాత మీరు ఎప్పుడూ వేయించిన ఆహారాన్ని తినకూడదట. ఇది కడుపులో ప్రతికూల రసాయన ప్రతిచర్యలకు కారణమవుతుందట. మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందట.
అలాగే ఐస్ క్రీం తిన్న తర్వాత చాక్లెట్ తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదట. చాక్లెట్ లో ఉండే కెఫిన్ మీ కడుపులోని ఐస్‌క్రీమ్ తో కలిసి కడుపు నొప్పిని కలిగిస్తుందట. ఆల్కహాల్ ను ఐస్‌క్రీమ్ గా తప్పుగా భావించకూడదట. ఇది వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి సమస్యలను కలిగిస్తుందట. అలాగే ఐస్ క్రీమ్ తిన్న తరువాత కూల్ వాటర్ తాగడం, కూల్ డ్రింక్స్ తాగడం వంటివి అస్సలు చేయకూడదట. అలాగే వేడి పదార్థాలు కూడా అస్సలు తినకూడదని చెబుతున్నారు.