Site icon HashtagU Telugu

Health Care Tips: ఈ ఫుడ్స్ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు అస్సలు తాగకండి?

Mixcollage 30 Jan 2024 08 29 Pm 8669

Mixcollage 30 Jan 2024 08 29 Pm 8669

మామూలుగా చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కొంతమంది ఆహారం తింటూ మరోవైపు నీళ్లు తాగుతూ ఉంటారు. నిజానికి తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదు. అలా నీళ్లు పదే పదే తాగడం వల్ల ఎక్కువగా ఆహారం తినలేరు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఆహారాలు తినేటప్పుడు కానీ, తిన్న తర్వాత కానీ నీళ్లు అస్సలు తాగకూడదు. మరి ఎలాంటి ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. పాలు తాగే ముందు కానీ, తాగిన తర్వాత కానీ నీటిని అస్సలు తాగకూడదు.

పాలు తాగిన తర్వాత నీళ్లు తాగితే జీవక్రియ దెబ్బ తినే అవకాశం ఉంది. దీని వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా ఒక్కోసారి దాహం వేస్తుంది. దీంతో చాలా మంది నీటిని తాగేస్తూంటారు. ఐస్ క్రీమ్ తిన్నాక కూడా అస్సలు నీటిని తాగకూడదు. అలా తాగితే గొంతు నొప్పి వస్తుంది. పుల్లగా ఉండే పండ్లు, ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కొన్ని రకాల సీజనల్ పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగకూడదు. దీని వల్ల గొంతు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాల్చిన పప్పులు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదు.

దీని వల్ల కడుపులో నొప్పి వస్తుంది. అదే విధంగా వేరు శనగ తిన్న తర్వాత కూడా నీటిని తాగితే దగ్గు వస్తుంది. వేడిగా ఉండే పానీయాలు తాగిన తర్వాత కూడా నీటిని తాగకూడదు. టీ, కాఫీలు, సూప్‌లు వంటివి తాగిన తర్వాత నీళ్లు తాగితే.. జీర్ణ వ్యవస్థపై, పళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. వేడి పానీయాలు తాగిన ఒక 20 నిమిషాల వరకు నీటిని తాగకూడదు. అదేవిధంగా స్వీట్ తిన్న తర్వాత కూడా నీరు అస్సలు తాగకూడదు. ఇలా తాగితే చలువ పళ్ళు పడతాయి.

Exit mobile version