Roasted Corn: కాల్చిన మొక్కజొన్న తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ పని చెయ్యకండి.. ఎందుకంటే?

సాధారణంగా వర్షకాలంలో చాలామంది మొక్కజొన్నను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వర్షాకాలంలోనే ఎందుకంటే

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 08:00 PM IST

సాధారణంగా వర్షకాలంలో చాలామంది మొక్కజొన్నను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వర్షాకాలంలోనే ఎందుకంటే చల్లటి వాతావరణం లో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న లేదంటే ఉడకపెట్టిన మొక్కజొన్నను ఇందు ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వర్షాకాలం మొదలైతే రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ఈ మొక్కజొన్న లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఉడకపెట్టిన మొక్కజొన్న కంటే కాల్చిన మొక్కజొన్నని ఇష్టపడుతూ ఉంటారు. ఇక కాల్చిన మొక్కజొన్నకు కొంచెం ఉప్పు కారం, కాస్త నిమ్మ పండు తగిలించుకుని ఆ చల్లటి వాతావరణంలో రుచిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు.

అయితే మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, చాలామంది మొక్కజొన్న తిన్న తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే ఇలా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అవును, మీరు తినే ఏ రకమైన మొక్కజొన్న అయినా, మసాలా లేదా గ్రిల్ చేసినా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మరి మొక్కజొన్న తరువాత నీళ్లు తాగితే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కజొన్న తిన్న తరువాత నీరు తాగకూడదు. ఎందుకంటే మొక్కజొన్న తిన్న తరువాత నీరు త్రాగడం జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది.

మొక్కజొన్న తిన్న తర్వాత నీరు త్రాగడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న వెంటనే నీళ్లు తాగితే పీచు జీర్ణం కాదు. అలాగే జీర్ణవ్యవస్థ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మొక్కజొన్న జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. కడుపులో గ్యాస్‌ను కూడా కలిగించడంతో పాటు వాంతులు మరియు తలనొప్పిని కలిగిస్తుంది. మొక్కజొన్న తిని నీళ్లు తాగితే కచ్చితంగా ఇలాంటి అనుభవం అందరికీ వస్తుంది. మొక్కజొన్న తిని నీళ్లు తాగితే పొట్ట సమస్యలు చాలా వస్తాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే తాగునీళ్ల జోలికి వెళ్లకండి. మరి మొక్కజొన్న తిన్న తర్వాత నీళ్లు తాగాల్సి వస్తే మొక్కజొన్న తిన్న 45 నిమిషాల ముందు లేదా 45 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది. ఎందుకంటే మొక్కజొన్న తక్కువ మొత్తంలో జీర్ణమవుతుంది, కాబట్టి 45 నిమిషాల తర్వాత మీరు మొక్కజొన్న తినవచ్చు.