Tea and Dont’s: భోజనం చేసిన వెంటనే టీ తాగితే అలాంటి నష్టం తప్పదు!

టీ, కాఫీ ప్రస్తుత కాలంలో అయితే వీటికి చాలామంది ఎడిక్ట్ అయిపోయారు. వీటికి ఎంతలా ఎడిక్ట్ అయిపోయారు అంటే

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 09:00 AM IST

టీ, కాఫీ ప్రస్తుత కాలంలో అయితే వీటికి చాలామంది ఎడిక్ట్ అయిపోయారు. వీటికి ఎంతలా ఎడిక్ట్ అయిపోయారు అంటే రోజులో కనీసం ఒక ఐదు ఆరు సార్లు అయినా టీ ని,కాఫీని తాగుతూ ఉంటారు. చాలామందికి అయితే ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీలు తాగే అలవాటు ఉంటుంది. ఇక కొందరికి అయితే రోజులో కనీసం ఒక్కసారి అయినా టీ తాగకపోతే ఆరోజు అంతా కూడా ఎలాగో, ఏదో కోల్పోయి నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే చాలామందికి భోజనం చేసిన తరువాత టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరు మాత్రం భోజనం చేయకముందు టీ ని తాగుతూ ఉంటారు.

అయితే భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు కనుక ఉంటే ఆ పద్ధతిని మార్చుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల టీ లో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరంలోని కార్టీసాల్ స్టెరాయిడ్ హార్మోన్లు పెంచడం ద్వారా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల రక్తపోటు కచ్చితంగా వస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతున్నారు వైద్యులు. భోజనం చేసిన తర్వాత ఆహారం చేయడం కావడానికి సమయం పడుతుంది.

అటువంటి సమయంలో టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి ఒకవేళ టీ తాగాలి అనుకున్న వారు భోజనం చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టీ తాగడం వల్ల అటువంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. తద్వారా ఆహారం జీర్ణం అవడం కష్టతరం అవుతుంది. భోజనం చేసిన తరువాత టీ తాగడం వల్ల మీరు చేసిన భోజనం సరైన సమయంలో జీర్ణం కాకుండా టీ అడ్డుపడుతుంది అని వైద్యులు సూచించారు. కాబట్టి భోజనం చేసిన తర్వాత టీ ని చాలా వరకు తాగకుండా ఉండటం మంచిది. ఒకవేళ టీ ని తాగాలి అనుకుంటే తిన్న తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి తాగడం ఎంతో మంచిది.