Site icon HashtagU Telugu

Health Problems: పొరపాటున కూడా వీటిని తిన్న తర్వాత కాఫీ, టీ అస్సలు తాగకండి.. తాగారో అంతే సంగతులు?

Mixcollage 10 Jan 2024 06 45 Pm 107

Mixcollage 10 Jan 2024 06 45 Pm 107

మామూలుగా చాలామంది ఫుడ్ కాంబినేషన్ లో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ అసలు మంచిది కాదు. అలా ఫుడ్ కాంబినేషన్ గురించి తెలియక రకరకాల ఫుడ్ ని తీసుకుంటే మాత్రం అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అయితే అందులో భాగంగానే చాలా మంది టీ తాగిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. అంతే కాకుండా కొన్ని పదార్థాలు తిన్న వెంటనే టీ తాగుతూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. కానీ దీని వల్ల సైడ్ ఎపెక్ట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి సమస్యల బారిన పడతారు.

పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. కొన్ని పదార్థాల తర్వాత టీ తీసుకోకపోవడం మంచిది. మరి ఎలాంటి పదార్థాలు తిన్న తర్వాత టీ తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖ్యంగా చల్లటి పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్, ఐస్ క్రీమ్స్ వంటివి తిన్న తర్వాత టీ తాగడం వల్ల అది జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. నిజానికి చల్ల పదార్థాలు తిన్న తర్వాత వేడి వేడి టీ తాగడం వల్ల దంతాలు జలదరిస్తాయి. అలాగే చిగుళ్లు బలహీన పడవచ్చు. మీరు ఏదైనా చల్లటి ఆహారాలు తిన్న తర్వాత టీ తాగాలనుకుంటే కనీసం అరగంట అయిన గ్యాప్ తీసుకోవాలి. అలాగే నిమ్మరసం, షర్బత్ వంటివి తాగిన వెంటనే అస్సలే టీ తాగకూడదు.

ఇది ఉబ్బరం, ఆమ్లత్వం కల్గిస్తుంది. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రబావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్ టీ కలయిక అంత మంచిది కాదు. ఇది అనారోగ్యాని గురి చేస్తుంది. అలాగే పకోడి తిన్న తర్వాత కూడా టీని తాగకూడదు. చాలా మంది ఇంట్లో చేసిన చిరుతిల్లకు కాంబినేషన్ గా టీ ని తాగుతుంటారు. కానీ దీని వల్ల జీర్మ వ్యవస్థపై చెడు ప్రబావం ఉంటుంది. శనగ పిండితో చేసిన పదార్థాలు తిన్న 40 నిమిషాల తర్వాత టీ తాగితే మంచిది. అయితే చాలా మందికి ఆకలి వేసి తినడానికి ఏమీ అందుబాటులో లేనప్పుడు టీ తాగుతుంటారు. దీని వల్ల ఆకలి వెంటనే తగ్గిపోతుంది. అయితే ఖాళీ కడుపుతో టీ తాగితే హృదయ స్పందన రేటులో మార్పు చోటు చేసుకుంటుంది. దీనికి కారణంగా టీ పౌడర్ లో ఉండే కెఫిన్ శరీరంలో చాలా వేగంగా కరిగిపోతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది హృదయంపై ప్రభావం చూపుతుంది.

Exit mobile version