వేసవికాలంలో చాలామంది అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిన్నచిన్న కారణాలవల్ల చర్మం సమస్యలు వస్తూ ఉంటాయి. విపరీతమైన ఎండల కారణంగా చర్మం డల్ గా అయిపోవడం వాడి పోవడం పొడిబారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వాటితో పాటుగా మనం తెలిసీ తెలియక కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని, కాబట్టి పొరపాటున కూడా ఈ మండే ఎండల్లో మనం కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు. చాలామంది తరచుగా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు.
అయితే మాయిశ్చరైసర్ రాయడం మంచిదే కానీ జిడ్డుగా ఉండే దానిని మాత్రమే అసలు ఎంచుకోకూడదని చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే క్రీములను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. కీరదోస, అలోవెరాలతో తయారు చేసిన టోనర్ లను ఎంచుకోవడం మంచిదిట. అంతేకాకుండా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా సన్ స్క్రీన్ రాయాలట. ఎండాకాలంలో చెమటలు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. మన చర్మం సహజంగా బ్రీత్ తీసుకునేలా ఉండనివ్వాలట. అందుకే ఎక్కువ మేకప్ లు వేయకూడదని చెబుతున్నారు.
ఎండాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎక్కువ మేకప్ వల్ల బయటకు వెళ్ళినప్పుడు విపరీతమైన చెమటలు వస్తాయట. అలాగే మీరు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా కూడా కచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలట. ఎండ ఉన్న సమయంలోనే రాసుకోవాలి అనుకోకూడదని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో బయటకు వెళ్లినా కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవదని చెబుతున్నారు. ఎండాకాలంలో చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది. అది చాలా సహజం. అయితే చర్మంగా జిడ్డుగా ఉందని పదే పదే ముఖాన్ని కడగకూడదట. అలా తరచూ కడగడం వల్ల చర్మంలోని సహజ నూనెలు పోయి చర్మం పొడిగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఎండల్లో అందంగా కనిపించాలి అంటే తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలట. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసే ఆహారాలను పొరపాటున కూడా ఈ ఎండల్లో తీసుకోకూడదని,ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మన చర్మం నుంచి చెమట మరీ ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అది చర్మానికి మంచిది కాదట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు.