Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తులకు కాళ్లల్లో పుండ్లు వస్తున్నాయా? ఈ పనులు చేస్తే మటుమాయం

భారత్‌లో ఎక్కువమంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులో డయాబెటిస్ ఒకటి. దీనిని మధుమేహం అని కూడా అంటారు. అలాగే సింఫుల్ గా షుగర్ అని అందరూ పిలుస్తారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఇక తగ్గడం చాలా కష్టం.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 08:30 PM IST

Diabetes: భారత్‌లో ఎక్కువమంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులో డయాబెటిస్ ఒకటి. దీనిని మధుమేహం అని కూడా అంటారు. అలాగే సింఫుల్ గా షుగర్ అని అందరూ పిలుస్తారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఇక తగ్గడం చాలా కష్టం. జీవితాంతం అలాగే ఉంటుంది. ఎల్లప్పుడూ అదుపులో పెట్టుకునేందుకు జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అనేక ఆహార నియామాలు పాటించాల్సి వస్తుంది. షుగర్ లెవల్స్ ను పెంచే పదార్ధాలు తినకుండా ఉండాల్సి ఉంటుంది. దీంతో షుగర్ వచ్చిందంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అయితే షుగర్ బారిన పడినవారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాళ్లకు పుండ్లు కూడా ఒకటి. డయాబెటిస్ వచ్చినవారికి కాళ్లు జిమ్ మనడం, కాళ్ల వేళ్ల మధ్యలో పుండ్లు రావడం, కాళ్ల కింద పుండ్లు రావడం లాంటి జరుగుతూ ఉంటాయి. షుగర్ లెవల్స్ బాగా పెరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. షుగర్ లెవల్స్ ఎక్కువైనప్పుడు శర్మానికి స్పర్శ ఉండదు. దీని వల్ల కాళ్లకు పుండ్లు పడినా నొప్పి అనిపించదు. దీంతో చాలామంది అలాగే పట్టించుకోకుండా వదిలేస్తారు. దీని వల్ల కాళ్లను కూడా తొలగించే ప్రమాదం రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కాళ్లకు ఇన్ఫెక్షన్ సొకి మొత్తానికి వ్యాపించే అవకాశముంటుంది. అప్పుడు ఆపరేషన్ చేసి కాళ్లను తొలగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో షుగర్ పేషెంట్లు ముందే జాగ్రత్త పడి చికిత్స తీసుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడవచ్చు. షుగర్ పేషెంట్ల కాళ్లకు వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్లను వైద్య బాషలో డయాబెటిక్ ఫ్రూట్ అంటారు. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోవడం, రక్తనాళాలు బిగుసుకుపోవడం వల్ల కాళ్లకు సమస్యలు వస్తాయి. కాళ్ల మంటలు లాంటివి వస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే కాళ్లను కోల్పేయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.