Site icon HashtagU Telugu

Bad Breath: రెండుసార్లు బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Mixcollage 11 Jul 2024 12 45 Pm 1204

Mixcollage 11 Jul 2024 12 45 Pm 1204

మామూలుగా మనం నోటిని బ్రష్ తో ఎంత బాగా శుభ్రపరుచుకున్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా, ఒకరకంగా చెప్పాలి అంటే మనకే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన పోగొట్టుకోవడం కోసం చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అది కేవలం కొంతసేపు మాత్రమే నోరు వాసన రాకుండా ఆపగలుగుతుంది. అయినా కూడా మీ నోరు అలాగే వాసన వస్తూ ఉంటే అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

మరి రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ నోటి దుర్వాసన వస్తుంటే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి నోటి దుర్వాసన ఉన్నవారు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా ఉండదు. అంతేకాదు ధూమపానం, మద్యపానం సేవించడం వల్ల కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. అదేవిధంగా, నోటి లేదా శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేసే వివిధ వ్యాధుల వల్ల నోటి దుర్వాసన వస్తుంది.

కాగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. సైనసైటిస్, బ్రాంకైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు దుర్వాసనకు కారణం అవుతాయి. ఈ అంటు వ్యాధులు సంభవించినప్పుడు, బ్యాక్టీరియా శ్వాస కోశంలో గుణించి, బయటకు వచ్చే దుర్వాసనతో కూడిన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా అసిడిటీ, గ్యాస్, పొట్టలో అల్సర్ వంటి జీర్ణ సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కొంతమందికి చిగుళ్ల వ్యాధి కారణంగా లేదా దాని వల్ల నోటి దుర్వాసన ఉండవచ్చు. దీని కోసం, మీరు చిగుళ్ల వ్యాధికి చికిత్స తీసుకోవాలి. కిడ్నీ వ్యాధి రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేసే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది రక్తప్రవాహంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఈ టాక్సిన్స్ శ్వాస మీద అమ్మోనియా లాంటి వాసనను కలిగిస్తాయి. ఇది నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి లివర్ వ్యాధుల వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీని వల్ల నోటి దుర్వాసన కూడా వస్తుంది.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.