ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వెస్ట్రన్ టాయిలెట్ల ఉపయోగం పెరిగిపోయింది. ఇదివరకటి రోజుల్లో కేవలం విలేజి స్టైల్ టాయిలెట్లను మాత్రమే ఎక్కువగా వినియోగించే వాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారు ముసలి వాళ్లు, రకరకాల ఆపరేషన్ అయిన వాళ్లు ఈ వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే వీటి వాడకం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అవును ఇలాంటి మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుందట. ఎలా అంటే వెస్ట్రన్ టాయిలెట్ సీటు శరీరంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది.
ఈ కారణంగా సంక్రమణ ప్రమాదం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు వస్తాయట. పొట్టను క్లీన్ చేసేటప్పుడు సరైన శరీర భంగిమలో ఉండటం చాలా ముఖ్యం. ఇండియన్ టాయిలెట్ సీటులో కూర్చోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది పొట్టను బాగా శుభ్రపరుస్తుంది. కానీ వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చోవడం వల్ల కడుపు, మలద్వారం కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీ కడుపు సరిగా శుభ్రం కాదు. అలాగే ఇది మలబద్దకానికి కూడా దారితీస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.
వెస్ట్రన్ మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ లో మలవిసర్జన చేయడానికి కూర్చున్నప్పుడు సీటు నేరుగా శరీరాన్ని తాకుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ టాయిలెట్ లో టిష్యూ పేపర్ ఉపయోగించడం వల్ల మలం లేదా టిష్యూ పేపర్ యోనిలోకి ప్రవేశిస్తే సంక్రమణ ప్రమాదం పెరుగుతుందట. వెస్ట్రన్ టాయిలెట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మలబద్దకం దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. దీనివల్ల మలవిసర్జన చేసేటప్పుడు ఆనల్ కండరాలపై చాలా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు.
కడుపును ఖాళీ చేయడంలో ఇబ్బంది దిగువ పురీషనాళం, పాయువు సిరలలో వాపు వస్తుందట. ఇది పైల్స్ ఏర్పడటానికి దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి పొట్టను క్లీన్ చేయడానిక ఇండియన్ టాయిలెట్ ను ఉపయోగించడం మంచిది. ఈ మరుగుదొడ్డిలో మన శరీరం స్క్వాట్ పొజిషన్ లో ఉంటుంది. ఇది మన మొత్తం జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే కడుపును సరిగ్గా శుభ్రపరుస్తుంది.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.