Site icon HashtagU Telugu

Early Wakeup Cons: అదేంటి.. ఉదయాన్నే నిద్ర లేస్తే అలాంటి సమస్యలు వస్తాయా?

Early Wakeup Cons

Early Wakeup Cons

మామూలుగా కొంతమంది ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ చేసుకుంటే మరి కొంతమంది రాత్రి సమయంలో ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే బారెడు పొద్దెక్కిన కూడా 10 గంటల వరకు అలాగే పడుకుంటూ ఉంటారు. అయితే అలా సూర్యోదయం అయిన తర్వాత కూడా అలాగే నిద్రపోవడం ఆధ్యాత్మికంగానూ అలాగే ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అందుకే పెద్దలు కూడా ఉదయాన్నే నిద్ర లేవాలని చెబుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి పరిశోధనలు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

అదేమిటంటే ఉదయాన్నే అర్లిగా లేచిన కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. అలాగే చాలామంది చలికాలంలో కూడా పొద్దున్నే నిద్ర లేవడానికి అంతగా ఇష్టపడరు. తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ఉదయం వేళ తొందరగా నిద్రలేచే వారిలో అల్జీమర్స్ రెండు రెట్ల జన్యు ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఇకపోతే ప్రొద్దున్నే నిద్రలేవడం వల్ల కలిగే దుష్ప్రభవాల విషయానికి వస్తే.. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల నిద్రలేమికి దారితీయవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్ర పోయి తెల్లవారుజామునే లేస్తే నిద్రలేమి బాధపెడుతుంది. దీని వల్ల అలసట, ఏకాగ్రత లోపిస్తుంది. మానసిక స్థితి దెబ్బతింటుంది. తెల్లవారుజామునే నిద్ర లేవాలనుకునే వారు రాత్రి వేళ త్వరగా నిద్ర పోవాలి.

కొంతమంది త్వరగా నిద్ర లేస్తే ఒత్తిడి, ఆందోళన ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. దీని వల్ల సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదు. డి-రెగ్యులేటెడ్ స్పీల్ సైకిల్స్ కు దారి తీస్తుంది. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల నిద్ర మత్తుగా అనిపిస్తుంది. పని చేస్తున్నప్పుడు పనిపై శ్రద్ధ పెట్టడం కష్టంగా ఉంటుంది. ఏ పని పైనా దృష్టి పెట్టలేక ఉత్పాదకత తగ్గుతుంది. మనకు మాత్రమే సరిపోయే నిద్ర సైకిల్ ను కనుగొని దానిని ఫాలో కావడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. పొద్దున్నే లేవడం వల్ల మనుషులు మూడీ అవుతారు. నిద్ర లేకపోవడం, ఒత్తిడి స్థాయి పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దీని మూడ్ స్వింగ్స్ కు దారితీస్తుంది. మూడ్ బాలేకపోతే భాగస్వామిలో, కుటుంబసభ్యులతో మనస్ఫూర్తిగా వ్యవహరించలేరు. ఇది మళ్లీ ఒత్తిడికి దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇలా సర్కిల్ లో తిరగాల్సి వస్తుంది.