Site icon HashtagU Telugu

Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ ఎక్కువగా తినకూడదా.. తింటే ఏమవుతుందో తెలుసా?

Watermelon

Watermelon

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ భగభగ మండే ఎండల్లో ఆరోగ్యంగా ఉండాలిఅన్నా, శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి అన్న వేసవిలో దొరికే పుచ్చకాయను తప్పనిసరిగా తినాల్సిందే. మిగతా సీజన్లతో పోల్చుకుంటే పుచ్చకాయ ఈ వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే పుచ్చకాయను కొంతమంది జ్యూస్ రూపంలో తీసుకుంటే మరి కొంత మంది అలాగే ముక్కలుగా కట్ చేసుకుని తింటూ ఉంటారు. వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదే కానీ అతిగా తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.

పుచ్చకాయని ఎక్కువగా తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయట. అయితే వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయలో 95 శాతం నీరు, ఫైబర్,ఇతర పోషకాలు ఉంటాయట. నిజానికి, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇకపోతే పుచ్చకాయ ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను అధికంగా తినకూడదట. ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ 70 లేదా అంతకంటే ఎక్కువ అధిక జీఐ ని కలిగి ఉంటుందట. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను ఎక్కువ మొత్తంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు.

అలాగే పుచ్చకాయలు పొటాషియం బాగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందువల్ల పుచ్చకాయను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అదేవిధంగా పుచ్చకాయలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందట. దీనివల్ల వాంతులు విరోచనాలు కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి అని చెబుతున్నారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయను వేసవిలో తీసుకోవడం మంచిదే కానీ ఎక్కువగా తీసుకుంటే ఓవర్ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుందని, సోడియం మొత్తాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. దాంతో వాపు అలసట వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి వేసవికాలంలో పుచ్చకాయ తినేవారు ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.