Site icon HashtagU Telugu

Pregnancy Tips: గర్భిణీలు నువ్వులు ఎందుకు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Pregnancy Tips

Pregnancy Tips

స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి పైనాపిల్ అలాగే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదని వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా నువ్వులను అస్సలు తీసుకోకూడదని అలా తింటే ఒకసారి గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీలు నువ్వులు ఎందుకు తినకూడదు?

పొరపాటున తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణులు నువ్వులతో చేసిన ఆహారాలను తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే నువ్వుల్లో వేడి చేసే గుణం ఉంటుంది. వీటిని లిమిట్ లో తినడమే మంచిది. వీటిని గర్భిణులు తరచూ తింటే గర్భాశయాన్ని ఉత్తేజితం చేస్తాయి. అందుకే గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు నువ్వులకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. నువ్వులు మామూలుగా నలుపు తెలుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. అందులో తెలుపు రంగు నువ్వులు అంత సురక్షితం కాదని అంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో షోషకాలను అందిస్తుందట.

కానీ మొదటి మూడు నెలలు నువ్వులకు దూరంగా ఉండటమే మంచిది. అయితే ఇది ఆరోగ్యకరమైన ఆహారం. కాబట్టి వీటిని తిన్నా లిమిట్ లోనే తినాలి. నువ్వుల్లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలను పొందాలంటే కొన్ని నువ్వులను మాత్రమే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో నువ్వులు తినొచ్చని చెప్పినా.. వీటికి దూరంగా ఉండటమే సేఫ్. ఎందుకంటే వీటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొదటి 3 నెలలు నువ్వులతో చేసిన ఆహారాలను పూర్తిగా మానుకోండి. అయితే దీన్ని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఎందుకంటే దీనివల్ల ఎన్నో సమస్యలు రావొచ్చు. నువ్వులు గర్భస్రావానికి కారణమవుతాయా? అన్న విషయానికి వస్తే.. పీరియడ్స్ తొందరగా రావడానికి నువ్వులను తినవచ్చట. అవును నెలసరి వేగవంతం కావడానికి నువ్వులు సహాయపడతాయట. కానీ గర్భిణీ స్త్రీలు వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలని, ఎందుకంటే అవి మీ శరీరంలో ఎక్కువ వేడిని సృష్టిస్తాయని, అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని అవుతున్నారు. అలాగే ఇవి పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయట.

note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.