భారతీయులు ఎక్కువగా ఇష్టపడే పానీయం ఏదైనా ఉంది అంటే అది టీ అని చెప్పాలి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో టీని ఎక్కువగా తాగుతారన్న విషయం చాలా మందికి తెలియదు. ఎక్కడికి వెళ్లినా సరే మనకు టీ కాఫీలు లభిస్తూ ఉంటాయి. ఇక ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు చాలాసార్లు కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ఉదయం, రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా తాగాలనిపించినప్పుడల్లా తాగడం ఒక అలవాటుగా మారిపోయింది. దాంతో కనీసం రోజుకి ఒక్కసారైనా తాగనిదే చాలామందికి రోజు కూడా గడవదు. టీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
చాలామంది ఉదయం చేసిన టీనే సాయంత్రం వరకు వేడిగా చేసుకుని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. టీని అవసరమైనప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసుకుని తాగాలి. అయితే 15 నుంచి 20 నిమిషాల కిందట తయారు చేసిన టీని మళ్లీ వేడి చేసి తాగితే ఎలాంటి హాని ఉండదు. కానీ పొరపాటున 4 గంటలకు మించి ఉన్న టీని మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరానికి ఎన్నో విధాలుగా హాని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మీకు టీ కానీ కాఫీ కానీ తాగాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకొని తాగాలని, అలాకాకుండా ఉదయం చేసిన మధ్యాహ్నం చేసిన టీ లను ఆ తర్వాత తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
నిజానికి టీని తిరిగి వేడి చేయడం వల్ల టీ రుచి, వాసనతో పాటుగా దానిలోని పోషకాలన్నీ పోతాయి. అలాగే దీనిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందట. ఇది ఒకటి లేదా రెండు గంటల్లో ప్రారంభం అవుతుందట. దీని వల్ల ఈ టీ మనకు ఒక విషంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పాలతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఎందుకంటే దీనిలో బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే మిల్క్ టీని తిరిగి వేడి చేయకూడదని చెబుతున్నారు. ఇకపోతే పాలతో తయారుచేసిన టీలో చక్కెర ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా పెరిగిపోతుంది. పంచదార, పాలతో టీని తయారు చేసినప్పుడు అది వెంటనే చల్లబడటమే కాకుండా చాలా త్వరగా కూడా చెడిపోతుంది. మళ్లీ వేడి చేసి తాగడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుందని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.