Site icon HashtagU Telugu

Drinking Water: ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Drinking Water

Drinking Water

మీకు కూడా ఉదయాన్నే వేడి నీరు తాగే అలవాటు ఉందా? అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదట. మరి ఉదయాన్నే వేడి నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచుగా వేడి నీళ్లు తాగడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎక్కువగా వేరు నీరు తీసుకోవడం వల్ల టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతింటాయట. దీంతో మనం కాసేపటి వరకూ ఏం తిన్నా వాటి టేస్ట్ తెలియదని చెబుతున్నారు.

వేడినీటిని తాగితే బాడీలో డీహైడ్రేషన్ పెరుగుతుందట. అలాగే బాడీ కొన్ని పోషకాలు, ఖనిజాలను అబ్జార్బ్ చేయడంలో ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని మందులు పనిచేయవని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే అది జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుందట. దీని వల్ల జీర్ణ సమస్యలు యాసిడ్ రిఫ్లక్స్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వేడి నీరు పరగడుపున తాగకపోవడమే మంచిది.

వేడిగా ఉన్న నీటిని పరగడపున తాగితే గొంతు మంటగా ఉంటుంది. రోజంతా ఆ మంట కంటిన్యూ అవుతుంది. అందుకే వేడి నీటిని ఉదయాన్నే తాగడం అంత మంచిది కాదట. అయితే ఎక్కువ వేడిగా ఉంది నీరు కాకుండా కేవలం గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తాగాలని చెబుతున్నారు. నీరు ఎంత వేడిగా ఉంటే అన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే వీడియో ఉండే నీరు తాగడం వల్ల గొంతు లోపల ఇన్ఫెక్షన్స్ అవకాశం కూడా ఉంటుందట. దానివల్ల ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా తాగాలి అన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెబుతున్నారు.