మామూలుగా మందు బాబులు మద్యం సేవించేటప్పుడు మద్యంతో పాటు రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. చిప్స్, పల్లీలు, ఆమ్లెట్, చికెన్ పకోడా, చికెన్ కర్రీ ఇలా రకరకాల ఆహార పదార్థాలు నంచుకుని తింటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది మద్యం సేవిస్తూ నాన్ వెజ్ ని తింటూ ఉంటారు. అయితే మద్యం తాగే వారు నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. కేవలం మద్యం తాగిన సమయంలో సేవించే సమయంలో మాత్రమే నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు. మరి ఈ రెండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మద్యం నాన్ వేజ్ రెండూ జీర్ణవ్యవస్థపై భారం చూపిస్తాయి. ఇది జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ , అతిసారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మద్యం కాలేయానికి హాని కలిగిస్తుంది. నాన్ వెజ్ ప్రోటీన్ ను జీర్ణించుకోవడానికి కాలేయం అదనపు పని చేయవలసి ఉంటుంది. ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచి, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం ఎక్కువ కొవ్వు గల నాన్ వెజ్ ఆహారాలు కలిసి హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, రక్తపోటును పెంచి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం, నాన్ వెజ్ రెండూ మూత్రపిండాలపై భారం పెడతాయట. ఇది మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలలో కొవ్వు, రసాయనాలు అధికంగా ఉంటాయి.
ఇవి మద్యంతో కలిసి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. మద్యం, నాన్ వెజ్ ఈ రెండూ శరీరాన్ని ఆయాసపరుస్తాయట. ఇది శక్తి స్థాయిలను తగ్గించి, నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మద్యం, నాన్ వెజ్ కలిసి తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందట. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ మద్యం సేవించే సమయంలో నాన్ వెజ్ ని దూరం పెట్టాలని ఒకవేళ తినాలి అనుకుంటే ప్రత్యామ్నాయంగా వేరే ఆహర పదార్థాలను తినవచ్చు అని చెబుతున్నారు..
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.