మామూలుగా మనం తరచుగా పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. కాఫీ, టీ, మిల్క్ లేదా పాలతో తయారు చేసిన స్వీట్స్ ని తింటూ ఉంటాం. అయితే పాలలో ఆవు పాలు లేదంటే గేదె పాలు తాగుతూ ఉంటారు. కొందరు ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం తాగడం మంచిదే. ఆవు పాలు గేదె పాలలో మనకు గేదె పాలే ఖరీదు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు గేదె పాలని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఆవు పాలు గేదె పాలు రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి అనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదట పాల వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. ఆవు పాలను తక్కువగా వినియోగించినప్పటికీ అందులో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఆవు పాలు తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయట. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పాలు శరీర నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయట. ఆవు పాలలో విటమిన్ డి, బీ12, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. దీని కారణంగా ఎముకలకు కావాల్సిన బలం అందుతుంది. దీంతో పాటు ఆవు పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో ఉండే ఇన్సులిన్‌ను నియంత్రిస్తుందని చెబుతున్నారు.
ఆవు పాల వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. ఆవు పాలలో ల్యాక్టోస్ అనే చెక్కెర మూలకం కొంచెం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిని జీర్ణించుకోవడం కొంతమందికి ఇబ్బంది కరంగా ఉంటుందట. అలాంటి వ్యక్తులు ఆవుపాలు తాగడం వల్ల సులభంగా బరువు పెరగడం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల బారిన పడతారట. అలాగే ఆవు పాలలో కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుందట. కొన్ని పాలలో గర్భధారణ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అలాగే కొంతమందికి పాల ప్రొటీన్ల సమస్య ఉంటుంది. ఇది కూడా ప్రమాదకరంగా మారవచ్చని చెబుతున్నారు.
గేదె పాల వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. కొన్ని వందల సంవత్సరాల నుంచి గేదె పాలు వినియోగంలో ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలోని చాలా మంది గేదె పాలనే వినియోగిస్తుంటారు. ఈ గేదె పాలలో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం కోసం, అలాగే కండరాల అభివృద్ధి కోసం సహాయపడతాయి. గేదె పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. అలాగే గేదె పాలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుందట. అలాగే ఆకలి ఎక్కువగా కాకుండా నియంత్రిస్తుందట. తద్వారా బరువు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
కాగా గేదె పాల వల్ల నష్టాల విషయానికి వస్తే.. గేదె పాల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అలాగే సులభంగా బరువు పెరిగిపోయేలా ఇది ప్రోత్సహిస్తుంది. ల్యాక్టోస్ అంటే చిరాకు ఉండే వారికి గేదె పాలు త్వరగా జీర్ణ కావు. దీని వల్ల ఉబ్బరం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
రెండింటిలో ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. ఇవి రెండూ కూడా తమదైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అలాగే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగే లాభనష్టాలను మీరే తెలుసుకొని ఉపయోగించడం, లేదంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.