Site icon HashtagU Telugu

Health Tips: వారంలో ఈ మూడు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. గ్యాస్ మలబద్ధకం మాయం అవ్వాల్సిందే!

Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఫుడ్ అని చెప్పవచ్చు. చాలా మందికి తిన్నది సరిగా అరగడం లేదని, పుల్లటి త్రేన్పులు వస్తున్నాయని అంటూ ఉంటారు. తిన్నది సరిగా జీర్ణం అవ్వకపోవడం వల్ల చాలామందికి నిద్ర కూడా సరిగా పట్టదు.

తిన్న ఆహారం జీర్ణం అయ్యి నిద్ర బాగా పట్టాలంటే మన డైట్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలు పండ్లు చేర్చుకోవాలని చెబుతున్నారు. కాగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు షుగర్ తక్కువగా ఉండే పండ్లని రెగ్యులర్‌ గా తీసుకోవాలట. ఆపిల్స్, బేరి, మామిడి పండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటి బదులు ద్రాక్ష, బెర్రీస్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. ఇందులో తక్కువ ఫ్రక్టోజ్ ఉంటుందట. వీటిని తినడం వల్ల మీకు గ్యాస్ అసిడిటీ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే అరటిపండ్లలో కూడాలో కూడా ఫ్రక్టోజ్ హై ఫైబర్ ఉంటుంది.

వీటిని తినడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగులని ప్రేరేపించే ఇనులిన్ అనే పదార్థం కలిగి ఉంటుందట. ప్రేగు సమస్యలు ఉన్నవారు లీన్ ప్రోటీన్స్‌ ని మాత్రమే తీసుకోవాలట. ఫ్రైడ్ ఫుడ్స్‌తో పాటు ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ కి దూరంగా ఉండాలట. హై ఫ్యాట్ ఫుడ్స్ పెద్దప్రేగు సంకోచాలను ప్రేరేపిస్తాయట. రెడ్‌మీట్‌ లో హై ఫ్యాట్ పదార్థం ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడానికి ఒక కారణం అని చెబుతున్నారు. ఎర్ర మాంసం కూడా పెద్ద ప్రేగు బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తుందట. ఇది ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని పెంచే రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఫైబర్ వంటి అద్భుతమైన పోషకాలు ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ వంటివి ఉంటాయట.

ఆకుకూరల్లోని ఒక రకమైన చక్కెర ఉంటుందట. ఇది హెల్దీ గట్ బ్యాక్టీరియాని పెంచుతుందట. ఫైబర్ ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మీరు గట్ మైక్రోబయోమ్‌ ని అభివృద్ధి చేసినవారవుతారట. అవకాడో అనేది ఫైబర్, పొటాషియం వంటి ముఖ్య పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ అని చెప్పాలి. ఇది హెల్దీ జీర్ణ పనితీరుని ప్రోత్సహిస్తుందట. ఇది లో ఫ్రక్టోజ్ ఫుడ్. కాబట్టి గ్యాస్‌ ని పెంచదు. అయితే అవకాడోలు తిన్నప్పుడు వాటిని పరిమాణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలట. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుందట కాబట్టి, మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.