Site icon HashtagU Telugu

Papaya: పచ్చి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!

Papaya

Papaya

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో బొప్పాయి పండు లభిస్తోంది. బొప్పాయి తరుచుగా తీసుకోవడం వల్ల అందానికి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నయం అవడంతో పాటుగా అందానికి సంబంధించిన సమస్యలు కూడా నయం అవుతాయని చెబుతున్నారు. అయితే ఎప్పుడు కూడా బొప్పాయి పండు ని మాత్రమే తింటూ ఉంటారు. పచ్చి బొప్పాయిని కేవలం కూరల కోసం అలాగే ఏవైనా స్వీట్ లు తయారు చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.

చాలా వరకు పచ్చి బొప్పాయిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే పచ్చి బొప్పాయి తింటే ఏం జరుగుతుందో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి బొప్పాయి తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట. పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైటో న్యూట్రిఎంట్స్ కొత్త కణాలను పెరిగేలా చేస్తాయట. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుందట.

పచ్చి బొప్పాయి శరీరాన్ని శుభ్రం చేస్తుందని, ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ గ్యాస్ట్రిక్ట్ సమస్యల నుండి కూడా బయట పడేస్తుందని, ఇందులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన ఎంజైములు శరీరంలోని పేగు కదలికలకు దోహదపడటమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుందట. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికీ పచ్చి బొప్పాయి జ్యూస్ కానీ లేదంటే బొప్పాయి ఆకుల జ్యూస్ కానీ ఇస్తే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని చెబుతున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినడం వల్ల కొందరిలో గర్భస్రావం జరిగే సూచనలు కనపడతాయట. కనుక గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు. అయితే బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవట.