Site icon HashtagU Telugu

Coconut Water : ఇలా తాగితే కొబ్బరి నీళ్లు కూడా ప్రాణాలు తీస్తాయని మీకు తెలుసా..?

Coconut Water In Bottles

Coconut Water In Bottles

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు (Coconut Water ) అత్యుత్తమంగా భావిస్తారు. సహజంగా లభించే ఈ ఎనర్జీ డ్రింక్‌ను చాలా మంది ప్రతిరోజూ తాగుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లను సరైన రీతిలో నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడవచ్చు. తాజాగా డెన్మార్క్‌లో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణ. నెలరోజులు నిల్వ ఉంచిన కొబ్బరి నీళ్లను తాగిన 69 ఏళ్ల వృద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఇది కొబ్బరి నీళ్లను నిర్లక్ష్యంగా నిల్వచేస్తే ఎంతటి ప్రమాదం కలగవచ్చో తెలియజేస్తోంది.

Canada: కెన‌డా పార్ల‌మెంట్‌కు తాళాలు.. ఎందుకో తెలుసా..? అక్క‌డ అస‌లేం జ‌రుగుతుందంటే?

కొబ్బరి బోండాలను ఫ్రిజ్‌లో 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వద్దనే నిల్వ చేయాలి. పైన కట్ చేసిన బోండాలను గిన్నెలో పెట్టి మూత పెట్టడం లేదా మూసివేసిన సంచిలో ఉంచడం వల్ల అవి 3–5 రోజులు వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. బయట ఉంచితే వేడి కారణంగా బ్యాక్టీరియా ఏర్పడి పాచి వస్తుంది. కొబ్బరి నీళ్లను(Coconut Water ) బాటిల్స్‌లో నింపుకొని ఎక్కువసేపు ఉంచడమూ ప్రమాదమే. అవి ఎక్కువసేపు నిల్వ ఉంచితే సహజ రుచి కోల్పోయి, పుల్లగా మారిపోతాయి.

కొబ్బరి నీళ్లను తాగేటప్పుడు అవి తాజా వాడినవేనా అనే విషయం తప్పనిసరిగా చూసుకోవాలి. తాగిన కొబ్బరి నీళ్లు శరీరానికి తడిపోకుండా ఎనర్జీని అందిస్తాయి. కానీ పాడైన నీళ్లు ఆరోగ్యాన్ని హానికరంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొబ్బరి నీళ్లను తాగేటప్పుడు వాటి నిల్వ పద్ధతిపై శ్రద్ధ వహించాలి.