Heart attack: బ్లడ్ టెస్టు గుండెపోటు ప్రమాదాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా?

గత రెండేళ్ల నుంచి గుండెపోటు కేసులు భారీగా పెరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు బలవుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 05:22 PM IST

గత రెండేళ్ల నుంచి గుండెపోటు కేసులు భారీగా పెరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు బలవుతున్నారు. ఈ మధ్యకాలంలో సినీఇండస్ట్రీతోపాటు ఎందరో ప్రముఖులు గుండెపోటుతో మరణించారు. అందులో చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించడం ఒక్కింత విషాదాన్ని నింపుతోంది. అయితే గుండెపోటు రావడానికి కారణాలేంటి. చాలామంది సెలబ్రెటీలు జిమ్ వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. గత రెండేళ్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుండెపోటుపై ఆందోళన పెరిగింది. ఫిట్ గా ఉండి…ప్రతిరోజూ వ్యాయామం చేసే వ్యక్తులకు కూడా గుండెపోటు వస్తుంది. ఇప్పుడు గుండెపోటు ప్రమాదం గురించి తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది.

ఈ ప్రశ్నకు ఆరోగ్యనిపుణులు సమాధానం ఉందనే చెబుతున్నారు. బ్లడ్ టెస్ట్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించవచ్చని చెబుతున్నారు. ఈ టెస్టు పేరు కార్డియో-సి రియాక్టివ్ ప్రోటీన్ (hs CRP)

కార్డియో-సి రియాక్టివ్ ప్రోటీన్ (hs CRP) టెస్ట్ అంటే ఏమిటి?
కార్డియో-సి రియాక్టివ్ ప్రోటీన్, దీనిని హై సెన్సిటివ్ సి-రియాక్టివ్ ప్రోటీన్ (హెచ్‌ఎస్ సిఆర్‌పి) అని పిలుస్తారు. ఇది సాధారణ రక్త పరీక్ష. CRP అనేది ఇన్ఫ్లమేటరీ మార్కర్. అంటే శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. అది రక్తంలో CRP స్థాయిని పెంచుతుంది. hs CRP ప్రామాణిక CRP కంటే ఎక్కువ సున్నితమైనది. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో, hs CPR స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే…ఆ వ్యక్తికి గుండె ధమనులు, గుండెపోటు, అకస్మాత్తుగా గుండెపోటు, పక్షవాతం లేదా చేతులు కాళ్ళ ధమనులలో రక్తం అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

40 ఏళ్ల తర్వాత స్క్రీనింగ్ అవసరం:
40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి గుండె ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇందులో కిడ్నీ, కాలేయం, షుగర్ , కొలెస్ట్రాల్‌కి సంబంధించిన రక్త పరీక్షలు ముఖ్యం. ఛాతీ ఎక్స్-రే, ECG, ఎకోకార్డియోగ్రఫీ, అవసరమైతే ట్రెడ్‌మిల్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఒకవేళ వ్యక్తి హై రిస్క్ కేటగిరీలో పడితే, అంటే వారి కుటుంబానికి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అధిక మద్యపానం లేదా ఊబకాయం చరిత్ర ఉన్నట్లయితే…అలాంటి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రత్యేకించి ఒక వ్యక్తికి ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే, వారు ఈ పరీక్షల కోసం కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి.