Skin Problems: స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తున్నారా.. అయితే అంతే సంగతులు?

మనలో చాలామందికి అనేక చెడ్డ అలవాట్లు ఉంటాయి. వాటిలో స్నానం చేశాక బ్రష్ చేయడం కూడా ఒకటి. అలా కూడా చేస్తారా అన్న అనుమానం చాలా మంది

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 08:40 PM IST

మనలో చాలామందికి అనేక చెడ్డ అలవాట్లు ఉంటాయి. వాటిలో స్నానం చేశాక బ్రష్ చేయడం కూడా ఒకటి. అలా కూడా చేస్తారా అన్న అనుమానం చాలా మందికి కలిగే ఉంటుంది. మామూలుగా కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేయడం అన్నది కామన్. కానీ కొందరు రివర్స్ గా స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తూ ఉంటారు. వినడానికి చండాలంగా ఉన్నా కూడా కొందరు ఇలాంటివే ఫాలో అవుతూ ఉంటారు. అయితే అలా స్నానం చేసిన తర్వాత బ్రష్ చేయడం మంచిదేనా అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కొన్ని కొన్ని సార్లు ఆఫీసులకు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు హడావిడిగా, ఏదో ఆలోచనలో ఉండి బ్రష్ చేసుకోలేదనే విషయం మరచిపోయి స్నానం చేసేస్తుంటాం. స్నానం తర్వాత బ్రష్షింగ్ గుర్తొచ్చి అప్పుడు బ్రష్ చేసేసుకుంటాం. ఇది ఎప్పుడో ఒకసారి పొరపాటున జరిగితే పర్వాలేదు కానీ అదే అలవాటుగా మారి తరచుగా జరిగితే మాత్రం చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. ఇంతకీ బ్రష్ చేసుకోవడానికి చర్మానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. మనం పళ్లు తోముకున్నపుడు బ్యాక్టీరియా నోటి నుంచి చర్మం మీదకు చేరే ఆస్కారం ఎక్కువట.

అందువల్ల నోరు చుట్టు, గడ్డం చుట్టు ఇరిటేషన్ రావచ్చు. తర్వాత నెమ్మదిగా అది మొటిమలకు కారణం అవుతుంది. బ్రష్ చేసే సమయంలో చర్మం మీదకు ట్రాన్స్ఫర్ అయిన బ్యాక్టీరియా వల్ల చర్మం మీద పగుళ్లు కూడా ఏర్పడవచ్చు. అందుకే స్నానానికి ముందే బ్రష్ చేసుకోవడం సురక్షితం మరి. ఒక వేళ స్నానం తర్వాత బ్రష్ చేసినా ముఖాన్ని మరోసారి సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం ముఖ్యం.