Tongue Brunt Remedies: వేడి పదార్థాలు తిని నాలుక కాలిందా.. అయితే ఇలా చేస్తే చాలు?

మామూలుగా మనం ఎప్పుడైనా వేడివేడి ఆహార పదార్థాలు వేడి పానీయాలు తాగినప్పుడు వెంటనే మనకు కాలిపోతూ ఉంటుంది. అలా నాలుక కాలినప్పుడు నాలుక మీద

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 09:07 PM IST

మామూలుగా మనం ఎప్పుడైనా వేడివేడి ఆహార పదార్థాలు వేడి పానీయాలు తాగినప్పుడు వెంటనే మనకు కాలిపోతూ ఉంటుంది. అలా నాలుక కాలినప్పుడు నాలుక మీద సుర్రుమని అనిపిస్తూ ఉంటుంది.. దీంతో ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా ఆ మంట కారణంగా చాలామంది తినకుండా అలాగే ఉంటారు. నాలుక కాలితే వచ్చే నొప్పి మాత్రం రెండు, మూడు రోజుల వరకూ ఉంటుంది. చాలా మంది ఈ ఇబ్బందిని ఫేస్ చేసే ఉంటారు. ఈసారి కనుక అలా జరిగితే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలను వెంటనే పాటించండి.. మరి అందుకోసం ఏం చేయాలంటే..
సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా పెరుగు కామన్ గా ఉంటుంది. నాలుక కాలినప్పుడు పెరుగును తింటే సరిపోతుంది.

పెరుగు చల్లగా ఉండటమే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది. నోట్లో పెరుగును కాసేపు అలా ఉంచుకుంటే మంట, నొప్పి రెండూ తగ్గుతాయి. అలాగే నాలుక కాలినప్పుడు ఉపశమనం కలిగించడంలో చక్కెర కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. వేడి వేడిది తిన్నప్పుడు నోరు మంటల ఉంటే పంచదారను నోట్లో వేసుకుని కాసేపు అలానే ఉంచుకోవాలి. ఇలా తింటే నొప్పి, మంట వంటివి తగ్గుతాయి. నాలుక మంట, నొప్పిని తగ్గించడంలో తేనె కూడా బాగా పని చేస్తుంది. ఈ సమయంలో తేనెను నాకడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ సెప్టిక్ ఉండటం వల్ల ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే.

ఒక్కోసారి వేడిది తిన్నప్పుడే కాకుండా తినే కంగారులో నాలుక కూడా కరుచుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా నొప్పిగా, మంటగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ మంట, నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. నాలుక కాలినప్పుడు వీలైనంతగా సాధారణమైన, చల్లగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉంటే బెటర్. దీని వల్ల మీ నాలుక చల్లబడి నొప్పి, మంట తగ్గుతాయి. ఇలా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో.. నాలుక మంట, నొప్పికి చెక్ పెట్టవచ్చు.