Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగకూడదా..?

డయాబెటిస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న రోగాల్లో ఇదొక్కటి. పదిమందిలో దాదాపు ఆరుగురు డయాబెటిస్ బారినపడుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ డయబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 10:00 AM IST

డయాబెటిస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న రోగాల్లో ఇదొక్కటి. పదిమందిలో దాదాపు ఆరుగురు డయాబెటిస్ బారినపడుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ డయబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. మన జీవనశైలిని సక్రమంగా చూసుకున్నట్లయితే షుగర్అదుపులో ఉంటుంది. లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే షుగర్ పేషేంట్లు తాగే, తినే ఆహారా విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి…ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగడం ఏమాత్రం మంచిదికాదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు ఎందుకో తెలుసుకుందాం.

1. పాలు సంపూర్ణ ఆహారం కిందికి వస్తాయి. అయినా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు పాలను కొన్ని సందర్భాల్లో తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట…పాలు తాగడం ఏమాత్రం మంచిది కాదట. పాలలో ప్రొటీన్లు, విటమిన్లు, ఫ్యాట్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీనిలో లాక్టోస్ రూపంలో ఉండే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు పాలు తాగాలా వద్దా అనే సందేహ ఉంటుంది.

2. డయాబెటిస్ఉన్నవారికి కార్బొహైడ్రేట్లు మంచివి కావు. పాలలో ఉండే లాక్టోస్ శరీరంలోకి వెళ్లి చక్కరగా మారుతుంది. ఈ చక్కెర కాస్త రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అందుకే పాల విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి.

3. పాలలో ఉండే లాక్టోస్ చక్కెరగా మారి…రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచేస్తాయి. అందుకే డయాబెటిస్ పేషంట్లు రాత్రి పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4. ఇక రాత్రిపూట లాక్టోస్ విచ్చిన్నమైనప్పుడు శరీరం తనకు లభించే శక్తిని ఉపయోగించుకోలేదు. అందుకే పాలను రాత్రిపూట కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తాగడం మంచిది. ఉదయం శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువ మొత్తంలో ఉంటాయి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.

5. షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా ఇతరులు రాత్రిపూట పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రాత్రిపూట పాలను తాగడం వల్ల బాగా నిద్రపడుతుంది. గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగినట్లయితే ఇంకా మంచి ఫలితాలుఉటాయి. పసుపు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.

6. ఇక మధుమేహులు పాలు తాగినా…అందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆవుపాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచవు. సోయా, బాదం, అవిసె పాలలో కేలరీలు, కార్బొహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని షుగర్ పేషేంట్లు తాగవచ్చు.

7. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజూ ఎంత పరిమాణంలో పాలు తాగాలి. సాధారణంగా రోజుకు మూడు కప్పుల పాలను తాగవచ్చు. అయితే ఒక కప్పు పాలను తాగిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ చక్కెర లెవెల్స్ పెరిగినట్లయితే పాలను తాగకపోవడమే మంచిది.