Anti Diabetic Veggie : క్యాబేజీని తరచుగా తింటే షుగర్ వ్యాదిగ్రస్తులకు ఇన్సులిన్ అవసరంలేదట….!!

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 08:00 PM IST

కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినే వ్యక్తుల్లో రక్తపోటు లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదట. కానీ చాలామంది ఈ క్యాబేజీని తినడానికి ఇష్టపడరు. అయితే షుగర్ బాధపడుతున్నవారు ఎట్టిపరిస్థితుల్లో క్యాబేజీని మిస్ చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాబేజిని తరచుగా తీసుకున్నట్లయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాబేజీని తినే వారు మధుమేహానికి మందులు తీసుకోవలసిన అవసరం లేదు. ఎంతగా అంటే బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ లోకి తెస్తుందని చెబుతున్నారు.

క్యాబేజీ చక్కెరను ఎలా నియంత్రిస్తుంది?
ప్రతి కూరగాయలు దాని స్వంత ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీని ప్రకారం, క్యాబేజీ రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే క్యాబేజీని మధుమేహాన్ని నియంత్రించే కూరగాయ అని అంటారు.

శరీర బరువు నియంత్రణ!
క్యాబేజీ తినడం వల్ల శరీర బరువు అదుపులో ఉండాలి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగానూ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీలో చాలా తక్కువ గ్లూకోజ్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి…ఇది మీ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి కార్బోహైడ్రేట్ ఎంత ముఖ్యమో చెబుతుంది.

మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది:
క్యాబేజీకి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం ఉంది. అంతేకాదు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మూత్రపిండాలు చేసే అతి ముఖ్యమైన పని రక్తంలోని అదనపు చక్కెరను మూత్రం ద్వారా విసర్జించడం. కొన్నిసార్లు కిడ్నీలు సరిగా పని చేయవు. దీని వలన శరీరం చాలా నీటిని కోల్పోవల్సి వస్తుంది. ఫలితంగా అధిక డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీంతో శరీరంలో రక్తం గట్టిపడతాయి. దీంతో కిడ్నీలు పనిచేయవు.

క్యాబేజీని ఎలా తినాలి?
క్యాబేజీని మీ ఆహారంలో ఏ రూపంలోనైనా చేర్చుకోవచ్చు. దీన్ని వారంలో మూడుసార్లు తీసుకోవచ్చు. మీరు క్యాబేజీని పప్పుతో కలిసి వండుకోవచ్చు. కావాలంటే వారానికోసారి క్యాబేజీ జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. అంతేకాదు సలాడ్ లో కూడా క్యాబేజీని చేర్చుకోవచ్చు.