Diabetes: డయాబెటిస్ పేషెంట్లు వర్షాకాలంలో మీ పాదాలను కాపాడుకోండిలా?

డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కేవలం ఒక ఆహారం విషయంలో మాత్రమే కాకుం

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 08:20 PM IST

డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కేవలం ఒక ఆహారం విషయంలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. డయాబెటిస్ పేషెంట్లకు ఎక్కువగా పాదాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అంటే చాలు తొందరగా మానవు.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు పాదాల విషయంలో వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వైద్యులు. తడిగా ఉండే ప్రదేశాలలో తిరగడం వల్ల, తేమతో కూడిన వాతావరణంలో ఉండడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

దీనివల్ల పాదాల్లోని నరాలు దెబ్బతింటాయి. పాదాలకు ఏదైనా దెబ్బలు తాకినా అవి త్వరగా నయంకాక ఇన్ఫెక్షన్ల బారిన పడి పాదాలు తొలగించుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే డయాబెటిక్ రోగులు కచ్చితంగా పాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వానాకాలంలో వారు తడి ప్రదేశాలలో తిరగకపోవడమే మంచిది. అయితే ఒకవేళ తడి ప్రదేశాలలో తిరగాలి అనుకున్నవారు బూట్లు చెప్పులు వంటివి తప్పకుండా ఉపయోగించాలి. ముఖ్యంగా బొటనవేలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి పాదాలకు తొందరగా ఎటువంటి దెబ్బ తగిలినా కూడా అది అంత ఈజీగా మానదు.

అందుకే పాదాలపై గాయాలు, దెబ్బలు వంటివి రాకుండా జాగ్రత్త పడాలి..పాదాలకు నొప్పి లేదా గాయం తగిలినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. పాదాలు ఎప్పుడూ కూడా పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి..తేమ లేకుండా జాగ్రత్త పడాలి. మీ పాదాలను గోరువెచ్చటి నీటితో కడిగి వెంటనే తడిని తుడిచేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తూ వల్ల పాదాలకు సంబంధించిన సమస్యలు చాలా వరకు రావు. ముఖ్యంగా వర్షా కాలంలో చెప్పులు లేకుండా నడవడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేలతడిగా ఉంటే పాదాలపై ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా పాదాలకు చేరుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్లు మొదలవొచ్చు. పాదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.

డయాబెటిక్ రోగులు రోజూ పాదాలలో రక్తప్రసరణను పెంచేందుకు వ్యాయామాలు చేయాలి. పాదాలలో రక్తప్రసరణ పెరిగితే ఇన్ఫెక్షన్, పుండ్లు వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి నడక, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి. పాదాలలో తిమ్మిరి పెట్టడం, జలదిరింపు వంటివి రావడం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమైతే పాదాలకు తిమ్మిరి పట్టడం, జలదరింపులు రావడం జరుగుతాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి.