షుగర్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని వైద్యులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ సీజన్ లో మధుమేహుల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుందని, తక్కువ రోగనిరోధక శక్తి డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
అందుకే మధుమేహులు వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలట. మరి డయాబెటీస్ పేషెంట్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇందుకోసం రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ఆహారాలను ఎక్కువగా తినాలట. ముఖ్యంగా ఈ సీజన్ లో వీలైనంత వరకు బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు ఇమ్యూనిటీని పెంచుతాయట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినడం వల్ల, కూరగాయలను ఎక్కువగా తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారట. వర్షాకాలంలో తడిగా ఉండటం వల్ల క్రిముల వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు సోకుతాయట.
అందుకే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే వీలైనంత వరకు తడిగా ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు వ్యాధులకు దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చెబుతున్నారు. వ్యాయామం తరచుగా చేయడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు కూడా వర్షాకాలంలో వారి వయసుని ఆరోగ్యాన్ని బట్టి వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. వర్షాకాలంలో సాధారణంగా నీటిని తక్కువగా తాగుతుంటారు. కానీ నీళ్లను కాలాలతో సంబంధం లేకుండా తాగాలి.
ఎందుకంటే నీళ్లను తక్కువగా తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇకపోతే మధుమేహులు వర్షాకాలంలో నీళ్లను తక్కువగా తాగడం మంచిది కాదు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందట. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో తగినంత నీటిని తాగాలని చెబుతున్నారు. వర్షాకాలంలో షుగర్ పేషెంట్లు తరచుగా చేయాల్సిన వాటిలో షుగర్ చెక్ చేసుకోవడం కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా షుగర్ చెక్ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే షుగర్ పెరిగితే దాన్ని త్వరగా గుర్తించలేకపోవచ్చు. అందుకే దీన్ని గుర్తించి నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. .