Diabetic Patients: మధుమేహం ఉన్నవారు పాలు తాగొచ్చ? తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్?

చాలామందికి ఉదయాన్నే లేవగానే పాలు తాగడం అలవాటు. మరి కొంతమంది పాలకు బదులుగా టీ కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు

  • Written By:
  • Publish Date - August 31, 2022 / 07:15 AM IST

చాలామందికి ఉదయాన్నే లేవగానే పాలు తాగడం అలవాటు. మరి కొంతమంది పాలకు బదులుగా టీ కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. అయితే పాలను కేవలం టీ, కాఫీల రూపంలో మాత్రమే కాకుండా ఆహార పదార్థాల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పాలను తాగడానికి ఇష్టపడరు. అయితే పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికంగా తాగుతూ ఉంటారు. పాలలో క్యాల్షియంతో పాటుగా కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

అయితే డయాబెటిస్ ఉన్నవారు పాలను తాగవచ్చా? ఒకవేళ తాగితే ఎటువంటి సమస్యలు వస్తాయి? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహం ఉన్నవారు పెరుగు, జున్ను, మజ్జిగ, వెన్న, నెయ్యి వంటి ప్రతి పాల ఉత్పత్తులలో ఎన్ని కేలరీలు ఉన్నాయి అన్న విషయాన్ని మొదట తెలుసుకోవాలి. మాములుగా డయాబెటిస్ వారి ఆహారంలో 45 నుండి 60 గ్రాముల కార్బోహైడ్రేట్ లను ఒకేసారి చేర్చాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు అల్పాహారం సమయంలో పాలు తాగేటప్పుడు మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో లేదో అది మీరు గమనించాలి.
మధుమేహం ఉన్నవారు పడుకునే ముందు పాలు తాగకూడదు.

నిద్రించడానికి, పాలు తాగడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. అలాగే మధుమేహం ఉన్నవారు పూర్తి క్రీమ్ పాలు తాగడం మానేయండి. ఇది చాలా కొవ్వును కలిగి ఉంటుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి మరింత పెరుగుతుంది. అలాగే రోజంతా 1 గ్లాసు కంటే ఎక్కువ పాలు తాగకూడదు. అలాగే సాధారణ పాలకు బదులుగా, పాలలో పసుపు లేదా దాల్చిన చెక్కను కలిపిన పాలను తాగవచ్చు. ఇది వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే పాలలో కాల్షియం, రిబోఫ్లేవిన్, ఫాస్పరస్, విటమిన్ డి, పాంతోతేనిక్ ఆమ్లం, లాంటి అనేక ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. కాగా పాలు ప్రోటీన్ యొక్క మంచి వనరు. పాలను వినియోగించడం వల్ల డయాబెటీస్ వస్తుంది లాంటి అపోహలను వదిలేయాలని, అంతేకాకుండా అటువంటి అపోహలను ఎక్కువగా నమ్మకూడదు అని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.