Diabetes Diet : ఈ 4 రకాల పండ్లను డయాబెటిక్ పేషెంట్లు తప్పనిసరిగా తినాలి!

డయాబెటిస్...ప్రపంచంలో సగం మంది ఎదుర్కొంటున్న సమస్య. ఆహారానికి సంబంధించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తినే ప్రతిదాన్ని ఆలోచించి తినాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 08:17 PM IST

డయాబెటిస్…ప్రపంచంలో సగం మంది ఎదుర్కొంటున్న సమస్య. ఆహారానికి సంబంధించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తినే ప్రతిదాన్ని ఆలోచించి తినాల్సి ఉంటుంది. లేదంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. అయితే డయాబెటిస్ రోగుల్లో ఎలాంటి ఆహారం తినాలన్న అయోమయం ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. ఏ పండు తినాలి…ఏది తినకూడదు అని. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో తింటే రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుకోవచ్చు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చో తెలుసుకుందాం.

1. ఆపిల్ :
ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో పాలీఫెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది వ్యాధులతో పోరాడుతుంది. ఆపిల్ తొక్క యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. యాపిల్స్ గుండె, ప్రేగు, చర్మం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ క్యాన్సర్‌తోనూ పోరాడుతుంది. మీరు ఉదయం అల్పాహారం సమయంలో ఈ పండును తింటే మంచిది.

2. ఆరెంజ్ :
నారింజపండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు? పుల్లని, జ్యుసి , పోషకాలతో నిండిన నారింజ మధుమేహ రోగులకు కూడా ఎంతోమేలు చేస్తుంది. నారింజలో ఉండే హెస్పెరిడిన్ మీ గుండె ఆరోగ్యంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది ఇందులో ఉండే ఫోలేట్ అనే మరో సమ్మేళనం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఆరెంజ్ ఆమ్లం, కాబట్టి ఖాళీ కడుపుతో తినకూడదు. మీరు భోజనం తరువాత ఈ పండును తినవచ్చు.
3.దానిమ్మ:
మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మ తినవచ్చా? ఇలాంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటే, గ్రీన్-టీ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది అరగంటలో శరీరంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. దానిమ్మ గింజలు మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.అంతేకాదు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పండు రక్తహీనతను నివారించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. భోజనం చేసిన తర్వాత తినవచ్చు.

4. కివి:
కివి.. మీ శరీరంలోని ప్రతి భాగానికి ప్రయోజనం చేకూరుస్తుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. కివిలో విటమిన్లు B6, C, మెగ్నీషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కివి రక్తపోటును తగ్గించడంతోపాటు ఇందులో ఉండే విటమిన్-కె గాయాలను త్వరగా నయం చేస్తుంది. బరువును తగ్గించడంతోపాటు మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కూడా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతుంది.