Site icon HashtagU Telugu

Diabetes Patients : షుగర్​ పేషెంట్లు ‘డార్క్ చాక్లెట్​’ తినొచ్చా ..?

Dark Chocolate

Dark Chocolate

చాక్లెట్ (Chocolate) అంటే పిల్లలకే కాదు, పెద్దలకూ కూడా ఎంతో ఇష్టం. అయితే డయాబెటిస్ (Diabetes Patients) ఉన్నవారు చాక్లెట్ తినొచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా స్వీట్స్, చాక్లెట్లు షుగర్ పెంచే అవకాశం ఉండటంతో, డయాబెటిక్ పేషెంట్లు వాటిని దూరంగా ఉంచేలా చూస్తారు. కానీ డార్క్ చాక్లెట్ (Dark Chocolate) మాత్రం ఈ విషయంలో కొంత భిన్నంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం.. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉండటంతో పాటు, కొకోవా శాతం అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధుల రిస్క్‌ను తగ్గించగలవు.

డార్క్ చాక్లెట్ వల్ల డయాబెటిక్ పేషెంట్లకు లాభాలు

డయాబెటిస్ ఉన్నవారు నియంత్రిత మోతాదులో డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే, శరీరంలోని ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొకోవాలో ఉండే ఎపికాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడానికి సహకరిస్తుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌ నివేదిక ప్రకారం, వారంలో కనీసం ఐదు ఔన్సుల డార్క్ చాక్లెట్ తీసుకునే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉంటుందట. అయితే ఇది చక్కెర కలిపిన మిల్క్ చాక్లెట్లకే కాదు, తక్కువ మిఠాస, అధిక కొకోవా శాతం ఉన్న డార్క్ చాక్లెట్లకే వర్తించనిది గుర్తుంచుకోవాలి.

తక్కువ మోతాదులో తినడం మంచిది

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నది నిజమే అయినా, దీన్ని అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, బ్లడ్ షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిపుణుల సలహా మేరకు వారానికి 2-3 సార్లు, చిన్న మోతాదులోనే డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. అలాగే షుగర్ లేకుండా, 70% లేదా అంతకంటే అధిక కొకోవా శాతం ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. సరైన ఆహార నియమాలు, వ్యాయామంతో పాటు అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.

Diabetes: డయాబెటిస్ నియంత్రణకు ఒంటె పాలు ఎంతో మేలు చేస్తాయ్.. రోజూ diet‌లో చేర్చాల్సిన కారణాలు ఇవే!